మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాట్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్నును సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ఉన్న ధర ఆధారంగా పన్నులో మార్పులు చేశారు బ్రాండ్‌ల వారీగా పన్నులో చేసిన మార్పులు ఇలా..
* రూ.400లోపు ఉన్న మద్యం బ్రాండ్లపై 50 శాతం వ్యాట్
* రూ.400 నుంచి రూ.2,500 వరకు ఉన్న మద్యం కేసుపై 60 శాతం వ్యాట్
* రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉన్న మద్యం కేసుపై 55 శాతం వ్యాట్
* రూ.5,000, ఆపై ఉన్న మద్యం కేసుపై 45 శాతం వ్యాట్
దేశీయ తయారీ బీర్ కేసుపై..
* రూ.200 కంటే తక్కువున్న ధర ఉన్న బ్రాండ్లపై 50 శాతం వ్యాట్
* రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్