– దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ
– రాజీవ్ స్ఫూర్తితో హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది
– రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోం
– రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారు. 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం కల్పించారు.
స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ.
కంప్యూటర్ ను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది పడింది. రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా,సామాజికంగా ముందుకు తీసుకెళతాం. సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపాం.
రాజీవ్ గాంధీని దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏళ్లు నిండిన వారు శాసన సభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తాం. ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోం.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, మండలి ఛీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.