Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుతో అమెరికా ఆర్థికవేత్త భేటీ

  • ఏపీ సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త మైఖేల్ క్రేమర్ భేటీ
  • ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ ను సత్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు
  • విద్య.. వైద్యం.. వ్యవసాయం.. నీటి పారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు. ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ ను ఏపీ సీఎం సత్కరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రొఫెసర్ మైఖేల్ క్రేమార్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్లోరినేటెడ్ నీటి సరఫరాపై ఎవిడెన్స్ యాక్షన్ అనే సంస్థతో కలిసి పని చేయనున్న ఏపీ గ్రామీణ నీటి సరఫరా విభాగం.. పైలట్ ప్రాజెక్టుగా ఏపీలోని 500 గ్రామాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

LEAVE A RESPONSE