-అమిత్‌షా గడ్డి తియ్యగా ఉందా?
-మోదీ, అమిత్ షా లను పండబెట్టి తొక్కి పేగులు తీయాలి
-మీరు ఎమ్మెల్యే చేస్తే అమిత్ షా కు తాకట్టు పెట్టారు
-తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి
-అంచనాలకు మించి బహిరంగసభ విజయవంతం
-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తి దగ్గర తాను పనిచేయనన్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ను పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కడిగిపారేశారు. మరి 90 రోజులు జైల్లో ఉన్న అమిత్‌షా దగ్గరకు ఎలా వెళ్లావు? అమిత్‌షా గడ్డి తియ్యగా ఉందా? అని నిలదీశారు.
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించిన తొలిసారి, ఆ నియోజకవర్గంలోని చండూరులో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభ అంచనాలకు మించి విజయవంతం కావడం, కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచింది. కోమటిరెడ్డి బ్రదర్స్ లేకుండానే భారీ జనసమీకరణ జరగడం విశేషం. ఈ సందర్భంగా రేవంత్ చేసిన ప్రసంగం వారిలో సమరోత్సాహం నింపింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరయినప్పటికీ.. సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు రవి తదితర అగ్రనేతల రాక కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
రేవంత్ ఏమన్నారంటే… మునుగోడులో చరిత్ర హీనులైన రాజగోపాల్ రెడ్డి, నమ్మిన కార్యకర్తలను మోసం చేసి అమిత్ షా పంచన చేరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి. రాజగోపాల్ రెడ్డి దుర్మార్గుడు, నీచుడు, కాంట్రాక్టర్ ఒక కుక్క అమిత్ షా దగ్గరకు వెళ్లారు…రాజగోపాల్ మనిషేనా? ఉప ఎన్నికల్లో ఓడితే కాంగ్రెస్ కు ఏమన్నా అయిందా? సోనియాకు పైసలు కావాలంటే పది వేల కోట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.
సోనియా, రాహుల్ స్కాంలు చేసిందని ఈడీ వేధింపులకు గురిచేస్తోంది. మోదీ, అమిత్ షా లను పండబెట్టి తొక్కి పేగులు తీయాలి. మునుగోడు గడ్డపై ఐతే కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టు జెండా ఎగిరింది. అధికారం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని నేతలు అంటున్నారు. సోనియా ప్రతిష్టను అమిత్ షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. మీరు ఎమ్మెల్యే చేస్తే అమిత్ షా కు తాకట్టు పెట్టారు. బీజేపీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఒకవేళ మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచే ఎందుకు పోటీ చేయడం లేదు?
జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి దగ్గర నేనెలా పని చేస్తా అంటున్నవ్? 2014 కంటే ముందు ఒక్క కేసన్నా ఉందా? నేను 30 రోజులు ఉంటే అమిత్ షా 90 రోజులు జైలులో ఉన్నాడు కదా?అమిత్ షా పెట్టే గడ్డి తియ్యగా ఉందా? మునుగోడు కార్యకర్తల బలం ముందు బీజేపీ ఆటలు సాగవు. మునుగోడు లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం. ప్రతి ఊరికి ప్రతి మండలానికి నేనే వస్తా.. మీకు అండగా ఉంటా.
ధైర్యం చెప్పడానికే ఇక్కడకు వచ్చాం..: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మునుగోడు నియోజకవర్గం చండూరులో ఏర్పాటు చేసిన ఈనాటి ఈ సమావేశం ఒక ప్రత్యేక సమయం లో ఏర్పాటు చేయడం జరిగింది.మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా ఇక్కడ అనేక పర్యాయాలు కాంగ్రెస్ ని గెలిపించారు. అలాగే మరోసారి కాంగ్రెస్ ని గెలిపించుకోడానికి ఏర్పాటు చేసిన సమావేశం.మీ అందరి
ఉత్సాహం, ఉరకలు చూస్తే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ను గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని, మిమ్మల్ని చూస్తే అర్థమైతుంది . ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, మీరందరూ ఒక సంఘంగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించిన మీ అందరి కోసం మేము ఉన్నాం అని, మీ తరుపున మేము ఉన్నాం అని ధైర్యం చెప్పడానికే ఇక్కడకు వచ్చాం.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా మునుగోడు లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ కి ఓట్లేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నా.