కొమరం భీం నచ్చితే…
రామరాజు సంగతేంటి!
సరే..హోమ్ మంత్రి అమిత్ షా అర్ ఆర్ ఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించి మరీ కలవడంలో
రాజకీయ కోణం లేదనే నమ్ముదాం.
నిజానికి జూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మనవడు గనక..ఆయనకు ప్రజల్లో అమితమైన ఫాలోయింగ్ ఉన్నా గాని తాత పార్టీలో ఊహించిన స్థాయిలో ఆదరణ లేకపోవడంతో ఈరోజున అమిత్ షా ఆహ్వానం వార్త అంత సంచలనం కలిగించింది.ఒకవైపు భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై కన్ను వేసి తదనుగుణంగా పావులు కదుపుతున్న సమయమిది. అందులో భాగంగా ఈనాడు పత్రిక అధినేత రామోజీరావును..పనిలో పనిగా జూ ఎన్టీఆర్ ను షా కలిశారు.మొన్న చిరంజీవిని కూడా మోడీ దగ్గరికి తీసుకున్నారు.అయితే జూ రామారావుతో షా భేటీ వెనక రాజకీయాలు లేవని బిజెపి ఉటంకిస్తోంది.అది ఓకే అనుకుందాం..
కేవలం ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసి రామారావు నటన నచ్చి అమిత్ షా అంతటి వ్యక్తి జూనియర్ ను కలవడం వింటుంటే.. అబ్బే.. ఏమిటో అదోలా ఉంది. గతంలో మన పెద్ద హీరోలు ఎవరినీ
ఏ రాజకీయ పార్టీ నాయకులు ఇలా మెచ్చి కలిసి దానికి ఇంత ప్రచారం కల్పించిన ఉదంతాల గురించి మనం విని ఉండలేదు.
రామారావు..నాగేశ్వర రావు జమానా నడుస్తున్న సందర్భంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు..
ఒక్కోసారి కేంద్రమంత్రులు..
ప్రధాన మంత్రులు
నెహ్రూ..నరసింహారావు..
వాజపేయి కూడా వారిని కలిసి ఉండవచ్చు గాక..ఇంత ప్రచారం ఏదీ..అప్పట్లో జనాలకు ఈ విషయాలు పెద్దగా తెలిసింది కూడా లేదు.సరే..సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు ఎన్టీఆర్..షా సమావేశం కాజువల్ అయినా అబ్బో..అదెంత ప్రచారం..!?
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం..ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసి ముచ్చట పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అందులో ఎన్టీఆర్ నటన తెగ నచ్చేసి హైదరాబాద్ పర్యటన సందర్భంగా యంగ్ టైగర్ తో ప్రత్యేకంగా సమావేశం కావడం ఓకే..
మరి అదే సినిమాలో ఇంచుమించు అంతే అద్భుతంగా నటించిన రామ్ చరణ్ షాకి అస్సలు ఆనలేదా.. ఆయన నటన షా సార్ కి నచ్చలేదా..
ఎన్టీఆర్ నటనతో పోలిస్తే తేలిపోయినట్టా..
రాజుగారి పెద్ద భార్య మంచిదంటే…చిన్న భార్య సం’గతేంటి’..ఏం .ఎన్టీఆర్ తో పాటు చరణ్ ని కూడా పిలిస్తే అదెంత హుందాగా ఉండేది.
ఇద్దరూ సమానమే అనుకున్న సినిమా..ఒకరికి పిలుపు..మరొకరికి చిన్నచూపే కదా..
ఏంటో మరి ఈ సమావేశ ధర్మంలో షా సార్ మర్మం..!
చెర్రీ..సారీ..!
ఈఎస్కే