మహిళా, ఓ మహిళ ఎక్కడమ్మా నీవు లేనిది? ఆకాశమంత ఎత్తు ఎదిగినా అణుకువతో మెలుగుతావు.
సహనశీలి, సంస్కారవంతురాలవై సంసార సాగరంలో మునిగి తేలేది నీవేనమ్మా !
వెల్లువ నీవై వేద భూమిలో వెలుగైనది నీవేనమ్మా ! డాక్టరుగా, యాక్టర్ గా పాలించే పాలకురాలిగా పారిశ్రామిక వేత్తగా..
పడతివి నీవై ఈ పుడమి తల్లి దీవెనలు పొందినావమ్మా! కలెక్టర్ నీవై కర్షకురాలు నీవై , కార్మికురా లి వై మదర్ థెరిసా ఆశయాలకు అడుగులు వేసే మహిళవు నీవై, విశ్వంలో వీర మహిళవై, వీరత్వంతో ఈ ధరణి యందు వెలుగొందునావమ్మా !
మహిళవు నీవమ్మ మంచితనానికి మరో రూపమై వెలిచినావమ్మ. గంగా , యమున , సరస్వతి , గోదావరి , కృష్ణవి నీవై, అ లివేణివై మా ఇంటి మహారాణివై, మాతృదేశంలో వెలుగొందిన మహిళకు నా అక్షర పుష్పాల అభినందనలు ..
