Suryaa.co.in

Andhra Pradesh

విజనరీ పాలనకు “అమృత” సాక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నత విద్యకోసం పొరుగురాష్ట్రాల బాట పట్టకూడదన్న ఉద్దేశంతో జాతీయస్థాయిలో పేరెన్నికగన్న అమృత విశ్వవిద్యాలయాన్ని గత ప్రభుత్వంలో అమరావతికి తీసుకొచ్చాం. దీంతోపాటు విట్, ఎస్ఆర్ఎం లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థలను కూడా ఆనాడు రాష్ట్రానికి రప్పించాం.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ విద్యాలయాలకు వెళ్లేందుకు కనీసం రహదారి సౌకర్యం లేకుండా రోడ్డును తవ్వేసి విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తున్నాడు. విధ్వంసమే ఎజెండాగా సాగుతున్న జగన్ ఏలుబడిలో రాష్ట్రంనుంచి వెళ్లిపోవడమే తప్ప కొత్తగా ఒక్క పరిశ్రమగానీ, విద్యాసంస్థగానీ వచ్చింది లేదు. విజనరీ పాలనకు, విధ్వంసకుడి అరాచకానికి సాక్షీభూతంగా నిలుస్తోంది ప్రజా రాజధాని అమరావతి!

…నారా లోకేష్,
(యువగళం పాదయాత్ర నుండి.)

LEAVE A RESPONSE