Suryaa.co.in

Andhra Pradesh

అమరావతిపై దాడి అంటే….రాష్ట్ర సంపద సృష్టిపై దాడి

– రంగన్నగూడెం లో జరిగిన అమరావతి రైతుల సంఘీ భావంలో వెల్లడించిన జేఏసీ నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ పిలుపు మేరకు అమరావతి నే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నేటికి 700 రోజులు పూర్తయిన సందర్భంగా వారు చేస్తున్న చారిత్రాత్మక ఉద్యమానికి మద్దతుగా ఈరోజు ఉదయం కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్న గూడెం గ్రామంలో స్థానిక జేఏసీ శాఖ అధ్వర్యంలో ధర్నా, ప్రదర్శన నిర్వహించి తమ పూర్తి సంఘీ భావం తెలియజేశారు.
ఈసందర్భంగా కృష్ణా జిల్లా అమరావతి జేఏసీ కో – కన్వీనర్ ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు వైఖరి వలన 2 లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తి నిరర్ధకంగా మిగిపోయిందని, అమరావతి పై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి యావత్ రాష్ట్ర సంపద సృష్ఠి పై దాడి అని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 34 వేల ఏకరాల భూమిని, రైతులు, కూలీలు త్యాగం చేశారని అందులోనే గత ప్రభుత్వ హయాంలో 9,125 కోట్లతో అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల కోసం ఇళ్ళు నిర్మించటం జగిగిందని, 10 వేల ఏకరాల మిగులుతో 2 లక్షల కోట్లు ఆస్తి రాష్ట్రానికి మిగిలిందని అన్నారు.
ఈ రెండున్నర సంత్సరాలలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ విద్వేష చర్యలవల్ల 139 సంస్థలు అమరావతి నుంచి వెనక్కి వెళ్ళాయని దీనితో రాష్ట్రంలో యువతకు కొత్తగా ఉద్యోగాలు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆస్తిని సద్వినియోగం చేసుకుని అమరావతి పై దాడి చేయకుండా ఉంటే నిధులు, ఉద్యోగాలకు కొరత ఉండేదికాదు అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అభివృద్ధి ని కోరుకుంటే ‘ న్యాయస్థానం టూ దేవస్థానం ‘ మహా పాదయాత్రలో ప్రజల గుండెచప్పుడు ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ సబ్యులు పుసులూరి లక్ష్మి నారాయణ, స్థానిక జేఏసీ నేతలు కసుకుర్తి అర్జునరావు, తుమ్మల దశరదరామయ్య , కనకవల్లి శేషగిరరావు, ఆళ్ళ రాజ, మువ్వ తాతారావు, కసుకుర్తి వేణు బాబు, మందపాటి రాంబాబు, కనకవల్లి యాకోబు, తలారి జాన్ కోటయ్య, నత్త అబ్రహం తదిరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE