– ప్రభుత్వం మారిన హిందువులపై ఆగని దాడులు
– భక్తుల ఆవేదన
పెదగంట్యాడ: గాజువాక దగ్గర బోనోజీ తోట వాంబే కాలనీ గరుడాద్రి కొండపైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపైన ఉన్న భక్తులపై ఎమ్మార్వో దాడి చేశారు. కొండమీద గుడిని గునపంతో పొడవడానికి వచ్చి భక్తులతో ఘర్షణ పడ్డారు. పెద్దగంట్యాడ ఎమ్మార్వో క్రైస్తవ మతానికి చెందిన వారని, ఒక క్రైస్తవుని నోటిమాటను ఫిర్యాదుగా స్వీకరించి హిందువుల గుడిలపై దాడులకు పాల్పడుతున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొండలపై ఉన్న అక్రమ చర్చల జోలికి వెళ్లకుండా కేవలం హిందువుల ఆలయాలపై దాడులు చేస్తున్నారని మహిళా భక్తులు ఆవేదన చెందారు. ప్రభుత్వాలు మారిన కూడా హిందువుల మీద దాడులు మాత్రం ఆగట్లేదని భక్తులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి హిందూ భక్తులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.