– ఇది ఒక నాయకుడి అవిశ్రాంత కృషికి.. ప్రజల కోసం పడే ఆరాటానికి ప్రతీక
చూడగానే ఇది ఒక మామూలు చిత్రంలా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న కథ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఎన్నో ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా 2006లో తన ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఒక దూరదృష్టితో ఆలోచిస్తున్న క్షణం ఇది. ఇది కేవలం ఒక సమావేశం కాదు, మరో చారిత్రక నగర నిర్మాణం కోసం, కాలం ఈ నిత్య విద్యార్థిని ముందే పంపిందేమో!
ఆనాడు సింగపూర్ను నిర్మించిన తీరును చూసి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రభావితమయ్యారు. ఎప్పుడూ అభివృద్ధి గురించే కలలు కనే ఆయన, అలాంటి ఒక విజన్ ఉన్న వ్యక్తిని కలవడానికి వెళ్లారు. ఈ చిత్రంలో ఇద్దరు దార్శనికుల చూపులు కలిసాయి. ఒకరి కళ్లలో సాధించిన విజయం, మరొకరి కళ్లలో సాధించబోయే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
’25వ లీ క్వాన్ యూ ఎక్స్ఛేంజ్ ఫెలో’గా నాయుడు అందుకున్న గౌరవం, వ్యక్తిగత విజయమే కాదు, తెలుగు ప్రజల ఆశలను మోసుకొచ్చిన గౌరవం. సింగపూర్ను ఆదర్శంగా తీసుకుని, ఒకప్పుడు హైదరాబాదును ప్రపంచ పటంలో నిలబెట్టిన ఆయన, ఆ అనుభవాన్ని, ఆ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ కోసం వినియోగిస్తున్నాడు.
ఈ చిత్రం కేవలం ఒక ఫొటోగ్రాఫ్ మాత్రమే కాదు. ఇది ఒక నాయకుడి అవిశ్రాంత కృషికి, ప్రజల కోసం పడే ఆరాటానికి ప్రతీక. ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆకాంక్షతో ఆయన చూపించిన ఈ దార్శనికత ఎల్లప్పుడూ మనకు గుర్తుండిపోతుంది. నిన్న సింగపూర్లో లీ క్వాన్ యూ జియోపాలిటిక్స్ అనే ఎక్స్ ఖాతాలో ఈ సంఘటనను పెట్టి, గుర్తుచేసుకున్నారు.