– సంతోష్‌రావు ఆస్తులపై విచారణ జరపండి
– మెదక్‌లో నా గెలుపు బీజేపీ కార్యకర్తలది.. నా కష్టమే
– కవిత ఈ విషయాలు అప్పుడెందుకు చెప్పలేదు?
– ఆ ఎమ్మెల్సీల గురించి కవిత ఎందుకు మాట్లాడలేదు?
– మెదక్ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్ట్‌పై విచారణ జరిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులపై వెంటనే ఏసీబీ డీజీతో విచారణ జరిపించాలని సీఎంను కోరారు.
గతంలో నార్సింగి టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సందీప్ రావు చేసిన అరాచకాలు చెప్పాల్సి ఉండే. సంతోష్ రావు వియ్యంకుడి హోదాలో మాత్రమే సందీప్ రావు అనేక అరాచకాలు చేశారు. అతడి ద్వారానే సంతోష్ రావు సెటిల్మెంట్లు చేసేవారు. సందీప్ రావును కేసులో ఎందుకు చేర్చ లేదు?
దుబ్బాకకు మీ కుటుంబం చేసిన అన్యాయం గురించి అనేక సార్లు చెప్పా. దుబ్బాక హరీష్ రావు వల్లే అన్యాయం జరిగిందని కూడా ఆనాడే చెప్పానని బీఆర్ఎస్ నుంచి సస్పెండయిన కవితనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఒకే విమానంలో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ప్రయాణం చేశారని తాను గతంలోనే చెప్పానని, కవిత చెప్పిన దాంట్లో కొత్తదనం ఏమీ కనిపించడం లేదన్నారు.
బీఆర్ఎస్లో తాను ఓడిపోవడానికి కారణం ఏమిటో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గతంలోనే చెప్పానన్నారు. తాను ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల మెదక్ ఎంపీగా గెలవలేదని, ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ అని స్పష్టం చేశారు.
పార్టీలోకి వెళ్ళాలా? వద్దా? అని కవిత ఊగిసలాడుతున్నా రు. ఆ ఎమ్మెల్సీలపై పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నగర శివార్లలోని ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూములు విషయం సైతం చెప్పాల్సింది.
కాళేశ్వరం విచారణపై రెండేళ్ళ సమయం వృధా చేసింది. సంతోష్ రావు ఈ స్థాయిలో ఆస్తులు ఎలా సంపాదించారో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.