– లగిచర్లలో పోలీసుల అర్ధారాత్రి దాడులపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్
హైదరాబాద్: కళ్లుండీ చూడలేని..చెవులుండీ వినలేని బధిరాంధక రేవంత్ ప్రభుత్వపు దాష్టీకానికి మచ్చుతునక ఇది! రెక్కాడితేనే కానీ డొక్కాడని ఆ పేద గిరిజనుల భూముల మీద కన్నేసిండు రేవంత్.మా భూములు గుంజుకోవద్దన్నందుకు, పోలీసులే దొంగల్లెక్క అర్ధరాత్రి ఆ నిస్సహాయుల ఇళ్ల మీద పడ్డారు. గడ్డపారలతో వారి ఇండ్ల తలుపులు విరగ్గొట్టారు. ఇంట్లో ఉన్న బీరువాను కూడా వదలకుండా పగలగొట్టారు. కళ్లు సరిగ్గా కనిపించని ఈ ముసలమ్మ చేతి కర్రను లాగి విసిరేశారు. దొరికినవాళ్లను దొరికినట్టు నిర్బంధించి చిత్రహింసలు పెట్టి, జైళ్లో వేశారు. ప్రజా ప్రభుత్వం పేరున గద్దెనెక్కి, ప్రజా కంటకుడిగా మారిన రేవంత్ నిర్వాకమిది.