– గురుకుల హాస్టల్స్ లో 36 మంది విద్యార్థుల చావుకు ప్రభుత్వం కారణం కాదా?
– రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి టాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం
– తెలంగాణ భవన్ లో పార్టీ నాయకులు మహేష్ రెడ్డి, నరేందర్ లతో కలసి మాట్లాడిన మాజీ కార్పోరేషన్ చైర్మన్ డా.కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు అంటూ గప్పాలు కొడుతోంది. 11 నెలల్లో ఏం సాధించారని ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు విద్యార్థులకు హాస్టల్స్ లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అంటున్నారు. ప్రజా పాలనను గాలికి వదిలేశారు. ఇప్పటి వరకు గురుకుల హాస్టల్స్ లో 36 మంది విద్యార్థుల చావుకు ప్రభుత్వం కారణం కాదా? అందుకే విజయోత్సవాలు జరుపుతున్నారా? పిల్లల మాక్ అసెంబ్లీలో కాంగ్రెస్ పాలనపై విద్యార్థిని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది.
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో వరదలు వస్తే కుటుంబంతో కలిసి
సినిమా చూసి, రైతులను విస్మరించి నందుకా? సరిగా పంట నష్టం ఇవ్వనందుకా? ప్రజాపాలన ఫెయిల్యూర్స్ ను నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో ఒప్పుకుంటున్నారు. బిఆర్ఎస్ హయాంలో గురుకుల విద్యార్థుల పై లక్షా 20 వేలు కేసీఆర్ ఖర్చు పెట్టారు. కేసీఆర్ సర్కారు హయంలో గురుకులాల్లోని విద్యార్థులు దేశంలో నెంబర్.1 గా తయారు చేశారు.
బిఆర్ఎస్ ఏం చేసినా సీఎం కుట్ర అంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేసినా టీఆర్ఎస్ కుట్ర అంటున్నారు? రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్ వద్దని నిరసన చేస్తే బి ఆర్ ఎస్ కుట్ర అంటున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఉన్న 13 అంశాలను ఎందుకు అమలు చేయడం లేదు? ప్రజాపాలన విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారు?
బిఆర్ఎస్ హయాంలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చాము. మీరు ఇచ్చేది దాంట్లో లబ్దిదారులు ఎంత? ప్రజా భవన్ సమస్యలకు పరిష్కారం కోసం కాదు,సమస్యలకు కేరాఫ్ అడ్డాగా మారింది.
ఆర్.ఆర్.(రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి )టాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారింది. ప్రజా పాలన ఏం సాధించారని చేపడుతున్నారు? ఇచ్చిన హామీల లో ఏ ఒక్కటి అమలు చేయలేదు.6 గ్యారెంటీ లలో ఒక్కటైనా పూర్తి చేశారా?
మహిళలకు నెలకు రూ.2500/- అమలు చేస్తున్నందుకు విజయోత్సవాలా? రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా రూ.15000/- ఇస్తున్నదుకు విజయోత్సవాలా? అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తున్నందుకు, దివ్యంగులకు 6000 ఇస్తున్నందుకు విజయోత్సవాలా? నిరుద్యోగులకు సం.రంలో 2లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు విజయోస్తావాలా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4000 ఇస్తున్నందుకు విజయోత్సవాలా?అడ్డబిడ్డలకు తులం బంగారం ఇస్తున్నందుకు విజయోత్సవాలా? ఎందుకోసం? ఏం సాధించారని? ఏ ఏ శాఖలో ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా?