– సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి
హైదరాబాద్: వానాకాలం సీజన్ సమయంలో అడ్డగోలు ఆరోపణలతో ప్రభుత్వం పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన పేరు తన్నీరు హరీష్ రావుకాదని అబద్దాల హరీష్ రావు అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రైతులకు జిలుగు జనుము అందించడం లో ప్రభుత్వం పై హరీష్ రావ్ చేసిన ఆరోపణలు అర్థరహితమన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ముందస్తుగానే పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వానకాలం 2025 సీజన్ కి తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పచ్చిరొట్ట విత్తనాలను 88,000 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్లు గుర్తుచేశారు.
తెలంగాణ వ్యాప్తంగా
* జీలుగ – 82,058 క్వింటాళ్లు
* జనుము – 5,836 క్వింటాళ్లు
* పిల్లిపెసర – 106 క్వింటాళ్లు
జిల్లాల వారీగా అవసరం మేరకు అందుబాటులో వున్నాయి.
అందుబాటులో ఉంచిన పచ్చిరొట్టల నుండి ఇప్పటివరకు రైతులు 60165 క్వింటాళ్లు ఉపయోగించుకున్నారు
జిల్లాల వారీగా రైతులు తీసుకున్న వివరాలు
* జీలుగు – 57,677 క్వింటాళ్లు
* జనుము – 2,484 క్వింటాళ్లు
* పిల్లిపెసర – 4 క్వింటాళ్లు
ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంకా పచ్చిరొట్ట విత్తనాలు 27835 క్వింటాళ్లు నిల్వ వున్నాయి
వివరాలు:
* జీలుగు – 24381 క్వింటాళ్లు
* జనుము – 3352 క్వింటాళ్లు
* పిల్లిపెసర – 102 క్వింటాళ్లు
ఇంకా రైతుల అవసరం మేరకు పచ్చిరొట్ట విత్తనాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వున్నదని, అనవసరపు ఆరోపణలు చేయకుండా వాస్తవాలను హరీష్ రావ్ తెలుసుకోవాలన్నారు.