ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి జనసంఘ్ సంఘటన కార్యదర్శిగా పనిచేసి,ఈ రాష్ట్రంలో 1967లో ముగ్గురు ఎమ్మెల్యే లు ,వారి సమయంలో 7గురు ఎమ్మెల్సీ లు గెలుపుకు కృషిచేసిన “ గోపాల్ రావు ఠాకూర్ “ పుణ్యతిథి సందర్భంగా వారికి నివాళులు.
వార్ధ జిల్లాలో జన్మించారు,1929 లో సంఘలో ప్రవేశం. డిగ్రీ పూర్తి చేసి, ఆర్,ఎస్,ఎస్,లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. సంఘ్ స్థాపకులు పరమపూజనీయ డాక్టర్జీ,పరమపూజనీయ గురూజీతోను సన్నిహిత సంబంధం కలిగియుండేవారు. డాక్టర్జీ కోరికపై దేశం నలుమూలల సంఘ కార్యాన్ని విస్తరించాలని నిర్ణయం జరిగింది.నాటి సర్ కార్యవాహా గురూజీ ఆదేశం మేరకు 1940 జూన్ లో గోపాల్ రావు ఠాకూరు విజయవాడకు పంపారు.
కొంతకాలం తర్వాత ఠాకూర్ జీ గుంటూరుకు పంపబడ్డారు.విజయవాడ కానీ, గుంటూరు లో కానీ తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు.తెలుగు రాదు.ఇక్కడి నుండి నాగపూర్ లో న్యాయవిద్య చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘ్ తో పరిచయం అయిన వారి చిరునామాలు, అదేవిధంగా హిందూ మహాసభకు చెందిన ఇద్దరు చుండూరు వెంకటరెడ్డి, గోవిందరాజుల దత్తాత్రేయ గారి చిరునామాలు మాత్రమే ఉన్నాయి.ఆ పరిచయాలు ఆధారం చేసుకుని సంఘకార్యం ప్రారంభం చేశారు.
ఠాకూర్ జీ జిల్లా ప్రచారక్ గా ఎక్కువకాలం కృష్ణా జిల్లాలో పనిచేశారు.ఆ సమయంలో కృష్ణాజిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం కూడా బాగా ఉధృతంగా ఉండేది కమ్యూనిస్టులు సంఘాన్ని తుదముట్టించాలని విశ్వ ప్రయత్నాలు చేసేవారు,కానీ ఠాకూర్జీ నేతృత్వంలో స్వయం సేవకుల ప్రయత్నాన్ని తిప్పికొట్టేవారు.
1948 జనవరి 31న పరమ పూజనీయ గురూజీ రాకకై విజయవాడలో ఒక బ్రహ్మాండమైన సంఘ శిబిరం ఏర్పాటు జరిగింది. సరిగ్గా ఆ క్రిందటి రోజు మహాత్మా గాంధీజీ హత్య జరగడంతో వారు రాలేకపోయారు అత్యా నెపాన్ని సంఘం మీదికి తోసేందుకై కమ్యూనిస్టులు విశ్వప్రయత్నం చేశారు. సంఘంపై దాడికి పూనుకున్నారు.
విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటైన సంఘ శిబిరానికి అప్పటికే వేల సంఖ్యలో స్వయం సేవకులు చేరుకున్నారు.గాంధీజీ హత్య తర్వాత శిబిరాన్ని రద్దు చేశారు.శిబిరం నుండి తిరిగి వెల్లుతున్న స్వయంసేవకులపై కమ్యూనిస్టులు దారికాచి దాడులు చేశారు. ఠాగూర్ జీ స్వయంసేవక బృందాలతో కలిసి వారిని ఎదుర్కొని పోరాడి అక్కడి తరిమివేశారు.
గాంధీజీ హాత్యా తర్వాత ఠాకూర్ జీని అరెస్టు చేసి తమిళనాడులోని వేలూరు జైలులో 6 నెలల పాటు నిర్బంధించారు ఆ తర్వాత విడుదల చేశారు.
ఆ తర్వాత జరిగిన సత్యాగ్రహ కార్యక్రమంలో ఠాకూర్ జీ ప్రేరణతో వందలాదిమంది స్వయం సేవకులు సత్యాగ్రహం చేశారు.కొద్దిరోజుల్లోనే సంఘంపై నిషేధం తొలగించబడింది. తిరిగి సంఘ శాఖలు ప్రారంభించబడ్డాయి.
1950 -51 లో రాయలసీమలో తీవ్ర కరువు ఏర్పడింది. గ్రామాల నుండి ప్రజలు వలసలుపోవడం పశువులకు మేతలేక మృత్యువాత పడటం జరిగింది.ఆ సమయంలో సంఘం ఠాకూర్ జీ నేతృత్వంలో సహాయ కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు.
1951 లో జనసంఘ్ పార్టీ ఏర్పాటు అయ్యాక,నాటి ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ బావూరావ్ మోఘే గారు గోపాల్ రావు ఠాకూర్ గారిని జనసంఘ్ లో పార్టీలో పనిచేయాలని తెలియజేశారు.
1952 లో కాన్పుర్ లో జరిగిన మొదటి జనసంఘ్ సమావేశాలకు ఠాకూర్ జీ మరియు ఎం.ఎల్ నర్సింహారెడ్డి(గుడివాడ) గారు వెళ్లారు.అక్కడి నుండి వచ్చాక రాష్ట్రమంతా పర్యటన చేసి 1953 నాటికి జిల్లా కమిటీలు వేశారు.1953 లో ఠాకూర్ జీ ఆంధ్రప్రదేశ్ జనసంఘ్ సంఘటన కార్యదర్శిగా నియుక్తి అయ్యారు.
జనసంఘ్ తరుపున రాష్ట్రంలో తొలి కార్యక్రమం “ కాశ్మీర్ సత్యాగ్రహం”ఠాకూర్ జీ రాష్ట్రమంతటా పర్యటించి కాశ్మీర్ అంశంపై జరిగిన బహిరంగ సభలలో మాట్లాడారు.
శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత 1953లో ముంబాయిలో జనసంఘ్ మహాసభలు జరిగాయి.మన రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సమావేశాల్లో ఠాకూర్ జీ ఆంధ్రప్రదేశ్ జనసంఘ్ సంఘటన కార్యదర్శిగా నియుక్తి అయ్యారు.
1954 నవంబర్ 6న గుంటూరులో జనసంఘ్ రాష్ట్ర సభలు మూడు రోజులపాటు ఠాకూర్ జీ ఆధ్వర్యంలో జరిగాయి.రాష్ట్రం మొత్తం నుండి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. దాంతో ఠాకూర్ జీ తెలంగాణ జిల్లాలో విస్తృతంగా పర్యటించి జనసంఘ్ శాఖలు ప్రారంభించారు. రాష్ట్ర శాసనమండలికి తొలిసారి జరిగిన ఎన్నికలలో “దివ్యజ్ఞాన సమాజం” నేతగా ఉన్న అవసరాల రామారావు గారిని జనసంఘ్ తరఫున పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీకి పెట్టడం జరిగింది.
రామారావు గారిని ఠాగూర్ జీయే పార్టీలో చేర్పించారు. తర్వాత వారు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా,జనసంఘ్ జాతీయ అధ్యక్షులు కూడా పనిచేశారు.
1962 ఎన్నికలలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో జనసంఘ్ పోటీ చేయాలని నిర్ణయించింది. 72 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు నిర్ణయించబడ్డారు.అదేవిధంగా 8 లోక్సభ స్థానాలు కూడా పోటీ చేయడం జరిగింది.ఎక్కడ గెలవలేదు.ఎన్నికల అనంతరం జరిగిన సమీక్షలో ఎన్నికల సమయంలో ఎంతగా శ్రమించిన ప్రయోజనం ఉండదు.కావున పార్టీకి నిరంతరం పనిచేసే కార్యకర్తల బృందం కావాలి అన్నారు.వారి సొంత వృత్తికి స్వస్తి చెప్పి రావాలి అన్నారు.ఠాకూర్ జీ సూచన మేరకు 9 మంది కార్యకర్తలు ఆ విధంగా వచ్చారు.
1962 లో శానమండలి రెండు స్థానాలు జనసంఘ్ గెలవడంతో రాష్ట్రంలో మంచి ఉత్సాహాం వచ్చింది.అఖిల భారతీయ జనసంఘ్ వాళ్ళు దక్షిణాది లో జాతీయ సమావేశాలు పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు ఠాకూర్ జీ విజయవాడలో పెట్టాలని కోరారు.వారి కోరిక మేరకు 1965 జనవరి 24,25,26 తేదీల్లో విజయవంతంగా నిర్వహించారు.ఈ సభల తర్వాత జనసంఘ్ ప్రతిష్ట పెరిగింది.
ఠాకూర్ జీ కృషి కారణంగా 1967 ఎన్నికల్లో జనసంఘ్ పార్టీ భారీ ఎత్తున ఎన్నికల్లో పోటీకి దిగింది ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవడం విశేషం.పరకాల (తెలంగాణ) నుండి జంగారెడ్డి గారు,విజయనగరం నుండి వొబ్బిలిశెట్టి రామారావు గారు ,నెల్లూరు నుండి అన్నదాత మాధవరావు గారు గెలిచారు.
ఠాకూర్ జీ సమయంలో శాసనమండలిలో 7 గురు సభ్యులు ఉండేవారు.
ఠాకూర్ జీ 1953 – 72 వరకు ఆంధ్రప్రదేశ్ సంఘటన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించారు.1972 – 1977 వరకు జనసంఘ్ జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్,కర్నాటక రాష్ట్రాలకు ఇంచార్జి గా బాధ్యతలు నిర్వహించారు.
1979లో మచిలీపట్నంలో కార్యకర్తలు అందరూ కలిసి ఠాకూర్ జీ షష్ఠి పూర్తి కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జగన్నాథరావు జోషి గారు,బంగారు లక్ష్మణ్ గారు పాల్గొన్నారు.
ఠాకూర్ జీ అనారోగ్యం కారణంగా 1983 జూన్ 3వ తేదీ గుంటూరులో తుదిశ్వాస విడిశారు.తర్వాత వారి భౌతిక దేహాన్ని హైదరాబాద్ సంఘ కార్యాలయానికి తరలించారు.4వ తేదీ జరిగిన అంత్యక్రియల్లో కుటుంబసభ్యులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.