రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( RSS)ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రాంత ప్రచారక్,భారతీయ జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ గోపాల్ రావ్ ఠాకూర్ జి వర్దంతి సందర్బంగా NTR జిల్లా విజయవాడ కార్యాలయము నందు గోపాల్ రావ్ ఠాకూర్ జి చిత్ర పటానికి పూల మాలను సమర్పించి ఘనంగా నివాళులు అర్పించిన బిజెపి నాయకులు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్ జీ మాట్లాడుతూ, డాక్టర్ గోపాల్ రావ్ ఠాకూర్ జీని RSS వ్యవస్ధాపకులు డాక్టర్ హెగ్డేవార్,గురూజీలు ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రాంత ప్రచారక్ గా నియమించారని,అప్పట్లో సరైన వసతి సౌకర్యాలు లేక పోయిన మరమరాలు,బఠానీలు మంచినీరు త్రాగి,రైల్వేస్టేషన్,గుళ్ళు,సత్రాలలో పడుకొని సంఘానికి పనిచేసేవారని,1948 లో విజయవాడ SRR కాలేజీలో Vరామారావుగారు,పిన్నమనేని లింగయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో మూడురోజుల RSS సమావేశాలు జరపాలని నిర్ణయించారని వివరించారు.
గాంధీ మరణం కారణంగా ఆ సమావేశాలు రద్దు అయ్యాయని,అప్పట్లో కమ్యునిష్టు,కాంగ్రెస్ పార్టీల ప్రాభల్యం వుండేదని, కాని అప్పట్లోనే గోపాల్ రావు ఠాకూర్ జీ సారధ్యంలో గ్రామ గ్రామానికి RSS విస్తరించిందని,అలాగే జనసంఘ్ పార్టీలో ఆయన సారధ్యంలో 1967 కు ముందు 7 MLC స్థానాలు తరువాత 3 MLA స్థానాలు కూడా విజయం సాధించాయని ,అటువంటి గొప్ప నాయకుని స్పూర్తితో మనమందరం ముందుకు నడవాలని పిలుపునిచ్చారు..
ఆయన 60 దశకంలో పక్షవాతం కారణంగా గుంటూరులో వుండేవారని,డాక్టర్ యజ్ఞనారాయణరావు గారు సమక్షంలో వుండేవారని జనసంఘ్ పార్టీ నాయకులు ఆయనకు షష్టిపూర్తి వేడుకలు ఘనంగా నిర్వహంచారని,ఆయన గుంటూరులో జూన్ 3 తారీఖున మరణించారని వివరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, భగవాన్ జీ,షేక్ బాజీ,కోలపల్లి గణేష్,యర్రాసునీత,లక్ష్మీదుర్గా,రత్నకుమారీ,శాంతి,సతీష్,ప్రవీన్,తరుణ్,నున్నకృష్ణ,ప్రసాద్,స్వాతి తదితరులు పాల్గొన్నారు.