Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డీ… ఖబడ్డార్

* సీఎం చంద్రబాబుపై నోరుజారితే తగిన గుణ పాఠం చెబుతామని హెచ్చరిక
* నైతికంగా పతనమైన నాయకుడు జగన్…
* రౌటీ షీటర్లకు పరామర్శతో అరాచకాలకు ప్రోత్సాహమిచ్చినట్లే…
* 5 ఏళ్ల అసమర్థ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
* దళితులను ఏనాడూ పట్టించుకోలేదు…
* ఉనికి కోసమే కుల, శవ రాజకీయాలు
* జగన్ పై మంత్రి సవిత విసుర్లు…
* కూటమి ప్రభుత్వం అన్ని హామీలూ నెరవేస్తోంది…
* పథకాల అమలుపై చర్చకు సిద్ధమా ?
– మంత్రి సవిత సవాల్

అమరావతి : నీతి, నిజాయితీకి నిలువెత్తురూపమైన సీఎం చంద్రబాబునాయుడు గురించి నోటికొచ్చిన మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం… ఖబడ్డార్ జగర్ రెడ్డి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. రౌడీ షీటర్లకు, గంజాయి గ్యాంగ్ కు పరామర్శ చేసి నైతికంగా పతనమైన రాజకీయ నాయకుడివని మండిపడ్డారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు జగన్ రెడ్డి రాజ్యాంగం, చట్టం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు సైతం జగన్ రెడ్డి మాటలను విని నవ్వుకుంటున్నారన్నారు. అయిదేళ్ల పాలనలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ అన్ని వర్గాలనూ జగన్ మోసం చేశారన్నారు.

దళితులను అన్ని విధాలా అన్యాయం చేశారన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారన్నారు. 2014-19లో అమలు చేసిన 27 పథకాలను, దళిత యువతకు స్వయం ఉపాధి పథకాలను నిలిపేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో గతంలో ఎన్నడూ లేనంతగా దళితులపై దాడులు జరిగాయన్నారు. దళిత మహిళలపై అఘాయిత్యాలు సైతం చోటుచేసుకున్నాయన్నారు. ఇన్ని జరిగినా ఏనాడూ దళితులను పరామర్శించిన పాపాన జగన్ పోలేదన్నారు.

మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను మానసికంగా హింసించి చంపారన్నారు. దళిత డ్రైవర్ ను డోర్ డెలవరీ చేసిన ఘనత కూడా వైసీపీ నాయకుడిదేనన్నారు. జగన్ కు కుల, శవ రాజకీయాలు చేయడం అలవాటైపోయిందని, అందుకే ఆయనను ప్రజలు పక్కనబెట్టారని అన్నారు.

దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ పరామర్శించిన వారి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ కూడా దళితుడేనన్నారు. ఆయననెందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అయిదేళ్లలో ఎంతమంది దళితులను జగన్ రెడ్డి పరామర్శించాడో చర్చించడానికి సిద్ధమా..? అని మంత్రి సవిత సవాల్ విసిరారు.

అరాచకాలకు జగన్ ప్రోత్సాహం

జగన్ రౌడీ షీటర్‌లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే అని మంత్రి సవిత తెలిపారు. జగన్ పరామర్శించిన చేబ్రోలు జాన్‌ విక్టర్‌పై 9, నవీన్‌ అలియాస్‌ కిల్లర్‌పై 11, దోమ రాకేష్‌పై 8 కేసులు ఉన్నాయన్నారు. అటువంటి క్రిమినల్స్ ను పరామర్శించడం జగన్ కే చెల్లిందన్నారు. తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని, కుర్చీ కోసం పా కు లాడరన్నారు.

బాబాయిపై గొడ్డలిపోటు వేసి, నారా వారి రక్త చరిత్ర అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించి, సానుభూతి రాజకీయాలు చేశాడన్నారు. అన్నమయ్య జిల్లాలో డ్యాం కొట్టుకుపోయి 42 మంది చనిపోతే ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్‌ కాదా..? అని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎందుకు న్యాయం చేయలేదని నిలదీశారు.

ఖబడ్దార్ జగన్…

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం సీఎం చంద్రబాబు అని, ఆయన ఇష్టారాజ్యంగా నోరుజారి మాట్లాడితే సరైన గుణపాఠం చెబుతామని…ఖబడ్దార్ జగన్ అని మంత్రి సవిత హెచ్చిరించారు. సీఎం చంద్రబాబును అక్రమ కేసులతో అరెస్టు చేసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి వచ్చిన స్పందన వచ్చిందో తెలియదా..? జగన్ అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదన్నారు.

రౌడీ షీటర్లను పరామర్శిస్తూ… కుల రాజకీయాలకు తెరతీయడం సరికాదన్నారు. జగన్ ఒక రంగుల రెడ్డి అని.. ఆయనవి చీప్ పాలిటిక్స్ అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. జగన్ హయాంలో జే ట్యాక్స్ చెల్లించలేక కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు.

నువ్వే వెన్నుపోటుదారుడివి…

ప్రజలను, తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిందని జగనేనని మంత్రి సవిత మండిపడ్డారు. ఆయనో వెన్నుపోటుదారుడని అన్నారు. జగన్ అసమర్థ పాలన కారణంగానే వైసీపీకి ప్రజలను 11 సీట్లు పరిమితం చేశారన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని, కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని మంత్రి సవిత తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం పాలన సాగుతోందని, చట్టం తనపని తాను చేసుకుంటోందని తెలిపారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టంలేదని, అదే సమయంలో తప్పు చేస్తే శిక్షించకూడదా..? అని ప్రశ్నించారు. వైసీపీ అయిదేళ్ల పాలనలో రైతుల సాగు చేసే పంటల కంటే, గంజాయి పంటే ఎక్కువ సాగైందన్నారు. బాబాయ్ కుటుంబాన్ని, అయిదేళ్ల అసమర్థ పాలనలో నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలను పరామర్శించాలని మంత్రి సవిత హితవు పలికారు.

హామీల అమలుపై చర్చకు సిద్ధమా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 నెలల కాలంలోనే ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుతోంని మంత్రి సవిత తెలిపారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఉచిత ఇసుక అందజేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామని, జగన్ చీకటి చట్టం ల్యాండ్ టైటిట్ యాక్టు రద్దు చేశామని తెలిపారు. రాష్ట్రంలో రహదారులు నిర్మిస్తున్నామన్నారు.

ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేల పెన్షన్లు పెంచామన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ లో మినహా మరే రాష్ట్రంలోనూ రూ.4 వేల పెన్షన్ ఇవ్వడంలేదన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నామన్నారు. లక్ష మంది మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ అందజేసి, కుట్టుమిషన్లు అందజేస్తున్నామన్నారు.

యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లక్షల కోట్ల విలువైన పరిశ్రమలను సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ తీసుకొస్తున్నారన్నారు. మరో 10 రోజుల్లో కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించనున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని, కొద్ది రోజుల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.

]ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామన్నారు. వచ్చే ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా కల్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఎన్నికల హామీల అమలుపై సిద్ధమా..? అని జగన్ ను మంత్రి సవిత సవాల్ విసిరారు. రైతులను జగన్ ఎలా మోసం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.

LEAVE A RESPONSE