Suryaa.co.in

Features

ఒక మరపురాని భారత దేశ చక్రవర్తి శ్రీ కృష్ణదేవ రాయలు

“దేశభాషలందు తెలుగు లెస్స” అని 500 సంవత్సరాల క్రితమే కీర్తించి తెలుగుభాషకు గొప్ప పేరు తెచ్చిన మహనీయుడు. తెలుగు కవులు ఎనిమిది మందికి తన ఆస్థానంలో చోటి ఇచ్చి… అష్టదిగ్గజాలుగా కీర్తించారు.
భువన విజయం అనే ఒక కళా వేదికను ఏర్పాటు చేసిన గొప్ప కళామతల్లి ముద్దుబిడ్డ. ఎందరో కవులకు ఆశ్రయమిచ్చిన కవి పుంగవుడు. తాను స్వయంగా *ఆముక్తమాల్యద *అనే గొప్ప గ్రంథాన్ని రచించిన గొప్ప కవి .
ఒక దేవదాసి నర్తకి ని తన రాణి గా చేసుకుని, కులమత భేదాలు లేవని ఆనాడే చాటిన గొప్ప మానవతావాది. హిందూ ధర్మ రక్షణ కోసం వేణు వేల భూములను ఆలయాలకు దానమిచ్చిన దానవేందృడు. తన సామ్రాజ్యంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు కట్టించిన గొప్ప భక్తుడు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని, తన దేవేరులతో కలసి ఏడుసార్లు దర్శించి ఆయనకు వేల కోట్ల ఆస్తులను సమకూర్చిన మహనీయుడు. అతి పెద్ద సైనిక శక్తిని కలిగి తన చుట్టూ ఉన్న 7 ముస్లిం రాజ్యాలను తన విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేసిన పోరాటయోధుడు.
ప్రపంచంలోనే హంపి నగరం అత్యంత గొప్ప పట్టణంగా ఆ కాలంలోనే కీర్తించడానికి కృషి చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు. తన సామ్రాజ్యంలో ముత్యాలు రత్నాలు రాసులుగా పోసిన పోసి అమ్మిన దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించిన వ్యాపార ఆర్థిక వేత్త.
శత్రు రాజ్యాల తో చేసిన అనేక యుద్ధాలలో స్వయంగా సైన్యానికి సైన్యాధ్యక్షుడు గా ముందు నిలిచి విజయాలు సాధించి తమ రాజ్యాన్ని *విజయనగర రాజ్యం *గా తీర్చిదిద్దిన గొప్ప ధీరుడు. వ్యవసాయాన్ని సుసంపన్నం చేసేందుకు దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద చెరువులు, కాలువలు ఆ కాలంలోనే నిర్మింపజేసిన గొప్ప రైతు బాంధవుడు.
శ్రీ శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికి భయపడిన మొగల్ ముస్లిం రాజులు. విజయనగర సైనిక పాటవం పై అప్పట్లోనే ప్రపంచ దేశాల ప్రశంశలు. విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ అప్పట్లోనే విదేశీ మారక నిల్వలు ఆర్జించేందుకు కృషి చేసిన గొప్ప ప్రపంచ వేత్త. ప్రపంచంలోనే విజయనగర కీర్తి పతాకను ఎగురవేసిన గొప్ప చక్రవర్తి.
శ్రీ కృష్ణదేవరాయల వారి జీవిత విశేషాలు
శ్రీకృష్ణదేవరాయలు సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకులుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు.రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు. చిత్తూరు జిల్లా నాగలాపురం గ్రామానికి చెందిన తెలుగు ఆడపడుచుగా కూడా మరో కథనం ప్రచారంలో ఉంది.
శ్రీకృష్ణదేవరాయలు దాదాపుగా 20 సంవత్సరాలపాటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. 10 సంవత్సరాల పాటు యుద్ధాలలో పాల్గొని సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. ప్రస్తుత ఆంధ్ర ,తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, గోవా తదితర ప్రాంతాల వరకు వీరి సామ్రాజ్యం విస్తరించింది. మరో పది సంవత్సరాల పాటు పూర్తి అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. ఈ 20 సంవత్సరాల ను విజయనగర సామ్రాజ్య చరిత్రలో స్వర్ణయుగంగా చరిత్రకారులు పేర్కొంటారు.ఈయన రాణులు తిరుమల దేవి, చిన్నమ్మ దేవి, అన్నపూర్ణమ్మ లు ముఖ్యులు. ఈయన కుమార్తె పేరు తిరుమలాంబ ,కుమారుని పేరు తిరుమల దేవ రాయలు.. తన కుమారునికి ఎనిమిది సంవత్సరాల వయసులోనే పట్టాభిషేకం చేశారు.
అయితే చిన్నవయసులోనే శ్రీకృష్ణదేవరాయల వారి కుమారులు శత్రు రాజులచే విష ప్రయోగంతో పరమపదించారు. ఈ సంఘటనలో తాను అప్పాజీ గా పిలిచే మహామంత్రి తిమ్మరసు తన కుమారుని హత్య చేయడంలో ఆయన పాత్ర ఉందని నమ్మారు. శత్రురాజులు కుట్రలో భాగంగా రాయలవారు తిమ్మరసు వారి కనులను పీకించి ఆయనను చెరసాలలో బంధింపచేశారు .అయితే చివరకు నిజం తెలుసుకుని ఆయనను విడుదల చేయించి క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటనలతో శ్రీకృష్ణదేవరాయల వారు అంతిమ సమయం లో తీవ్రంగా కలత చెందారు.
అనంతరం ఆయన తన సోదరుడైన అచ్యుతదేవరాయలును విజయనగర సామ్రాజ్య చక్రవర్తి గా పట్టాభిషేకం చేయించారు .శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామ రాయలు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు “డొమింగో పేస్, న్యూనిజ్‌” ల రచనల వలన తెలియుచున్నది.
రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి చాలా దోహదపదడినారు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి “అప్పాజీ” (తండ్రిగారు) అని పిలిచేవారు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4 న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈయన పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు, వీర నరసింహ రాయలు లను వారి అనుచరులనూ తిమ్మరుసువారు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించారు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు., గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు.
ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవారు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం పరిపాలించారు. శ్రీకృష్ణదేవ రాయలు 1529 అక్టోబరు 17 న మరణించినట్లు 2021 ఫిబ్రవరిలో కర్ణాటక లోని తుముకూరు వద్ద బయల్పడిన శాసనం ద్వారా తెలిసింది. …

అల్లం రంగనాయకులు రాయల్
జర్నలిస్టు, రచయిత ,
చైర్మన్ శ్రీ కృష్ణదేవరాయ ఫౌండేషన్ ,
శ్రీకృష్ణదేవరాయ బలిజ కాపు తెలగ అన్నదాన సంఘం ఉపాధ్యక్షుడు,
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షులు.
పులివెందుల..

LEAVE A RESPONSE