Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి జలగలా మారి పేదల రక్తం పీల్చుతూ మహిళల తాళి బొట్లు తెంచుతున్నారు

-మద్యంపై వచ్చే ఆదాయం చూపి రూ. 33 వేల కోట్ల అప్పులు తెచ్చి మద్య‎ నిషేదానికి తూట్లు పొడిచారు
– మద్యపాన నిషేదంపై మాట తప్పిన జగన్ రెడ్డికి మహిళలంతా బుద్ది చెప్పాలి
– టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జలగలా మారి పేదల రక్తం పీల్చుతూ జేబ్రాండ్ మద్యంతో మహిళల తాళి బొట్లు తెంచుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ మండిపడ్డారు. సోమవారం నాడు జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

నాడు మద్యపాన నిషేదం చేస్తానని ‎ మహిళల ఓట్లు దండుకున్న జగన్ రెడ్డి నేడు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపాన నిషేదం చేయబోమంటూ చెప్పి లిక్కర్ బాండ్లు తాకట్టు పెట్టి రూ. 8 వేల కోట్లు అప్పులు తెచ్చారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్ డీసీ) ద్వారా దొడ్డిదారిన ఇప్పటికే మద్యంపై వచ్చే 15 ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి ‎ బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు మరో రూ. 8 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఓ వైపు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ. 33 వేల కోట్లు అప్పులు తెచ్చారు, మరో వైపు ‎ఈ ఏడాది మద్యంపై రూ. 30 వేల ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టారు. అంటే పేదల రక్తం పిండి రూ. 66 వేల కోట్లు రాబడుతున్నారు.

మధ్యపాన నిషేదం అనే మాటే ఉండదని, పాక్షికంగా కూడా మద్య నిషేధం చేయమని.. అలా చేస్తే.. లిక్కర్ బాండ్లు మూడు నెలల్లో లిక్విడేట్ అయినట్లుగా భావించి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే నిబంధనకు అంగీకరించి ప్రభుత్వం హామీ పత్రం ఇచ్చి మరీ రూ. 8 వేల కోట్లు అప్పు తీసుకున్నారు. జగన్ రెడ్డి జలగలా మారి పేదల రక్తం పీల్చుతూ నాసిరకం జేబ్రాండ్ మద్యం విక్రయించి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు. 9.5 శాతం వడ్డీతో అప్పులు తేవాల్సిన అవసరం ఏంటి? ఆ భారం పేదల ప్రజలపై మోపి వారి రక్తం తాగుతారా?

మద్యం అమ్మకాలు, ఆదాయాన్ని ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతున్న జగన్ రెడ్డి మద్య అమ్మకాలు తగ్గాయని సాక్షిలో సిగ్గులేకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరిగినా వాటిని అధికారికంగా లెక్కల్లో చూపకుండా..మరో వైపు డిజిటల్ లావాదేవీలు నిర్వహించకుండా దొంగ లెక్కలు రాస్తూ ప్రజలను మోసం చేస్తూ వేల కోట్లు దిగమింగుతున్నారు. జగన్ రెడ్డి అండ్ కో బ్రతుకంతా దొంగ లెక్కలు రాయటం, దొరికిపోయాక ఊచలు లెక్కెట్టడం ఇదే పని. టీచర్ల చేత మద్యం అమ్మించిన ఘనత జగన్ రెడ్డిదే, మద్యంపై వచ్చే వ్యాట్ ని రెండు ముక్కలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం బేవరెజేస్ కార్పోరేషన్ కి దారి మళ్లించి ‎తండ్రి తాగితే కొడుకుకు అమ్మ ఒడి, కొడుకు తాగితే తల్లికి వృద్ధాప్య పింఛన్, భర్త తాగితే భార్యకు ఆసరా ఇస్తామని ప్రభుత్వమే చెప్పడం తుగ్లక్ పాలనకు నిదర్శనం కాదా?

ప్రభుత్వం అభివృద్ది పనులతో ఆదాయాన్ని సమకూర్చుకుని సంక్షేమ పధకాలు అమలు చేయాలి తప్ప మద్యం అమ్మకాలపై టార్గెట్లు పెట్టి మందుబాబుల రక్తం పీల్చి ఆ ఆదాయంతో సంక్షేమ పధకాలు అమలు చేయలనుకోవటం సిగ్గుమాలిన చర్య.జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నారు, మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. మద్యపాన నిషేదం పేరుతో మహిళల్ని మోసం చేయటమే కాక నాసిరకం మద్యం అమ్ముతూ మహిళల మాంగల్యాలు తెంచుతున్న జగన్ రెడ్డికి మహిళంతా కనకదుర్గా భవాని అమ్మవారిలా మారి తగిన బుద్ది చెప్పాలని అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE