– జడ్పీ సమావేశాలకు రావాలంటూ మంత్రికి ఆహ్వానం
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో… జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆనం విజయకుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న జడ్పీ సమావేశాలకు రావాలంటూ మంత్రిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ నివాసంలో మంత్రి నారాయణను ఆనం దంపతులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆనం అరుణమ్మ మంత్రితో సుదీర్ఘగంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జియం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.