Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అరాచకాలు

ఏ.పి.సి.సి. అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని అరాచక శక్తులు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఏ.పి.సి.సి. అధ్యక్షులు గిడుగు రుద్రరాజు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆంధ్రరత్న భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రేపల్లెలో జరిగిన బాలుడి దహనం దీనికి ఉదాహరణ అని అన్నారు.

బాధిత కుటుంబాన్ని రుద్రరాజు తో పాటు ఏ.ఐ.సి.సి.సెక్రటరీ మయప్పన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఇతర నాయకులతో కలిసి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాన్ని పార్టీ హైకమెండ్ తో మాట్లాడి తగిన సహాయం చేయడానికి ప్రయతిస్తామన్నారు.

రుద్రరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 కోట్లమంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ద్రోహం చేసింది అన్నారు. ఏ.ఐ.సి.సి.సెక్రటరీ మయప్పన్, క్రిస్టఫర్ తిలక్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ జాంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, శ్రీ రాకేష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు తో కలిసి రుద్రరాజు విలేకరులతో మాట్లాడుతూ జూలై నెల 10,11,12 తేదీలలో బెంగుళూరులో యువజన కాంగ్రెస్ సదస్సు జరుగుతున్నదని తెలిపారు.

ఆ సదస్సు లో యువత భవిష్యత్తుకు చెందిన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశం లో బెంగుళూఋ యువజన కాంగ్రెస్ సదస్సుకు చెందిన పోస్టర్ ను ఆవిష్కరించారు.

LEAVE A RESPONSE