-జగన్ పాలన అస్తవ్యస్తం
-అన్నింటా మాట తప్పుడు మడమ తిప్పడమే
-శవాలమీద పేలాలు ఏరుకొనే వైకాపా నేతలు
-అంబటి గంగమ్మ వద్ద 2.50లక్షలు డిమాండ్ చేయడం బావదారిద్య్రం
-బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సిరిసనగండ్ల శ్రీనివాస్
ప్రతిపక్షం లో వున్నపుడు పారదర్శకం , అవినీతి రహిత పాలనే నా ద్యేయం అన్నాడు వచ్చిన 3 1/2 సంవత్సరాల పాలనలో , భూ , ఇసుక , గంజాయి , ఎర్ర చందనం మాఫియా రెచ్చిపోవడానికి జగన్ పాలనే కారణం. నీ పాలన గురించి జన్మదినం రోజు అన్నా సింహావలోకనం చేసుకో.
ఢిల్లీ మద్యం మాఫియాలో వైస్సార్సీపీ ఎంపీ మాగుంట , కవిత ల ప్రమేయం వున్నట్లు , ఆంధ్రలో అమ్ముతున్న నాసిరకం మద్యం వెనుక వైస్సార్సీపీ దే !మద్యం 24/7 అందుబాటులోకి తెచ్చి జోబులు నింపుకొంటున్నాడు. జాబ్ క్యాలెండరు లేదు , మెగా డిస్సీ లేదు , వలసలు ఆగలేదు , పరిశ్రమలు రాలేదు , వున్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. వరదల వల్ల దెబ్బతిన్న పొగాకు , అరటి రైతులను పరామర్శించిన పాపాన పోలేదు.
విశాఖ పర్యటనలో ప్రధాని మోది గారు సూచించినట్లుగా, ఒంగోలు నందు ప్రవాస యోజన 22,23 తేదిన ఒంగోలు చుట్టముట్టనున్న కాషాయ నేతలు సోము వీరరాజు నుండి కేంద్ర మంత్రి మురళీధరన్ వరకు తిష్ట , క్షేత్ర స్థాయి పార్టి బలోపేతం , ప్రజా సమస్యల మీద 22, 23 రెండు రోజులు దృష్టి.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు , ఉపాధ్యక్షుడు శివారెడ్డి , అజయ్ , అనిల్ , ఉమారాణి , కోటేశ్వరి , రాజేష్ తదితరులు పాల్గొన్నారు