Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్ర గ ‘మత్తు’

-సరిహద్దుల్లో నిఘా నిద్రపోతుందా?
-ఏపీ నుంచే వచ్చాయంటున్న పక్క రాష్ట్రాల పోలీసులు
-అయినా నిద్రమత్తులో యంత్రాంగం
-అధికార పార్టీ నేతల సౌజన్యంతోనే గంజాయి అమ్మకాలు అంటున్న ఎన్ డి ఏ కూటమి నేతలు
– గంజాయి అక్రమ రవాణాపై తాజాగా చంద్రబాబు ట్విట్
– జగన్ కు సిగ్గుందా అంటూ ఫైర్
నాడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ నేడు గంజాయిప్రదేశ్

(పి అనిల్)

ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయింది కానీ మత్తుమందుల రవాణాలో మాత్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలబడింది. దేశంలో ఎక్కడ గంజాయి డ్రగ్స్ పట్టుబడ్డ వాటి మూలాలు ఏ విజయవాడలోనో.. ఏ విశాఖపట్నంలోనో తేలుతున్నాయి. వందల కోట్లు ఖరీదు చేసే ఈ మాదక ద్రవ్యాలు ఎలాంటి నిఘా లేకుండానే యదేచ్చగా సరిహద్దులు దాటుతుండటం ఆశ్చర్యం.

మరి నిరంతరం సరిహద్దుల వద్ద కాపలా కసే
నిఘా నిద్రపోతుందా? పక్క రాష్ట్ర పోలీసులు ఏపీ నుంచి గంజాయి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని బహిరంగంగా చెబుతున్నా పాలకులలో కదలిక రాధా అన్నది బుద్ధి జీవుల ప్రశ్న.

దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నేడు జగన్ రెడ్డి పాలనలో దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేస్తూ గంజాయిప్రదేశ్ గా మారిందన్న విమర్శలు విపక్షాల నుండి వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాలలు, కాలేజీలు, బడ్డీ కొట్లలో సైతం గంజాయి,డ్రగ్స్ అమ్మతున్నారు. పాఠశాలలు, కాలేజీలు, బడ్డీ కొట్లలో గంజాయి,డ్రగ్స్ అమ్మతున్నారు, మొన్న కర్నూలు మెడికల్ కాలేజీలో విద్యార్దుల దగ్గర గంజాయి పట్టుబడింది, మరో వైపు ఒంగోలు రిమ్స్ కాలేజీలో మెడికల్ విద్యార్దులు పట్టపగలే గంజాయి సేవించి వీధిరౌడీల్లా దాడులు చేసుకున్నారు.

రాష్ర్టంలో పరిస్ధితి చూసి విద్యార్దులు తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర సామాజిక న్యాయసాధికారిత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 12 వ స్ధానంలో, 18-75 ఏళ్ల లోపు గంజాయి వినియోగంలో 11 వ స్ధానంలో ఉంది. బాల్లో ఓపియడ్స్ కి సంబందించిన మాదక ద్రవ్యాల వినియోగంలో 10 వ స్దానంలో ఉంది.

దేశ వ్యాప్తంగా 272 జిల్లాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు కేంద్రం గుర్తిస్తే అందులో ఉమ్మడి విశాఖ, తూ.గో, పగో. కృష్ణా జిల్లాలున్నాయి. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎంజీఎన్.ఆర్.ఈజీఎస్ పనులు వంటి వాటిలో ఏపీ నెం 1 స్ధానంలో ఉంటే ..నేడు గంజాయి అక్రమ రవాణాలో నెం.1 స్ధానంలో ఉంది.

అధికార పార్టీ నేతలు తన అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాలను పెంచిపోషిస్తూ జాతిని నిర్వీర్యం చేస్తున్నా రన్న ఆరోపణలు వెళ్ళు వెతుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగానికి ప్రధాన కారణంనిరుద్యోగిత ..ఉద్యోగం, ఉపాధి లేని నిరుద్యోగులు భవిష్యత్ పై నిరాశ నిస్ర్పహలకు లోనై మత్తుపధార్ధాలకు బానిసలైవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లేక మత్తు పధార్దాలకు బానిసలై నాలుగేళ్లలో 1745 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వైసీపీ పాలనలో ఏపీ గంజాయి డెన్ గా మారింది, విశాఖ, తూ.గో ఏజెన్సీ ఏరియా లో ఒక కీలక అధికార ప్రతినిధి ఆయన అనుచరుల ఆధ్వర్యంలో సుమారు 15 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోందని గతంలో టిడిపి బహిరంగంగానే ఆరోపించిన విషయం తెలిసిందే.

టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్ గా అభివృద్ది చేస్తే నేడు గంజాయి డెన్ గా అభివృద్ది చేశారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. మన రాష్ట్రం నుంచే దేశం మొత్తానికి గంజాయి సరఫరా అవుతోందని సరిహద్దు రాష్ట్రాలు, రాష్ట్రంలో జరుగుతున్న దందాను ఎండగడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, కేరళ సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయి ఏపీ నుండే ఎగుమతి అయినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు.

ఒక్క గంజాయే కాదు, ‎ హెరాయిన్‌, కొకైన్‌ వంటి భయంకర మత్తు పదార్ధాల మాఫియా రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. దేశంలో ఏ మూలన గంజాయి పట్టుబడ్డా ..దాని మూలాలు ఏపీలో బయటపడుతున్నాయి. గతంలో బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు ఓ పార్సిల్ ను పరిశీలించగా 4.49 కిలోల ఎఫిడ్రిన్ అనే మత్తు పదార్దం దొరికింది. ఇది విజయవాడ భారతీ నగర్ లోని కొరియర్ సంస్ధ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్టు గుర్తించారు.

ఇలా ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వెళ్తున్నట్టు అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. చివరకు ఏపీ నుంచి గంజాయి, మత్తు పదార్ధాలు కొరియర్ ద్వారా ఆన్ లైన్ షాపింగుల ద్వారా విదేశాలకు సైతం రవాణా జరుగుతోందంటే పాలన ఏ విధంగా ఉందో నిఘా ఏ స్థాయిలో నిద్రపోతుందో స్పష్టమవుతోంది.

గతంలో గుజరాత్ ముంద్రా పోర్టులో ఆఫ్ఘనిస్తాన్‌ నుండి ఇరాన్‌ ద్వారా బెజవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72 వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది. టీడీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి అనే పదమే వినిపించకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటే.. నేడు రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యం మాఫియాలకు అడ్డాగా మార్చి ప్రజల్ని దోచుకుంటున్నారు.

రాష్రంలో గంజాయి, డ్రగ్ మాఫియా ఆగడాలను అరికట్టాలంటే సమర్థ నాయకత్వం కావాలన్నది ప్రజల కోరిక. పాలకుల దుశ్చర్యలను ప్రశ్నించకుండా ఉండేందుకే.. యువతను ఒక వ్యూహం ప్రకారం మత్తులో ముంచుతున్నారని, ఎన్డీఏ కూటమి విరుచుకుపడుతోంది. తాజాగా తెలంగాణలో భారీ స్థాయిలో పట్టుబడ్డ గంజాయి రవాణా విశాఖపట్నం నుంచి తరలి వెళ్లిందంటే, ఏ స్థాయిలో ఆంధ్రా నుంచి తెలంగాణకు గంజాయి తరలి వెళుతుందో అర్థం చేసుకోవడానికి పెద్ద మేధావులు కావక్కర్లేదు.

అసలు గంజాయి రవాణా ఇతర రాష్ట్రాలకు నిర్విఘ్నంగా నిర్నిరోధంగా జరుగుతుంది అంటే మన సరిహద్దుల వద్ద నిఘా వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పక్క రాష్ట్రాల నుండి మద్యం తీసుకొస్తున్నారా లేదా అని తనిఖీ చేసే అధికారుల శ్రద్ధ.. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్న గంజాయిని నిరోధించడంలో చూపిస్తే ఏపీకి ఈ అప్రతిష్ట దక్కేది కాదని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి

సమర్ధుడైన పాలకుడు లేనందు వల్లే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు.. రాష్ట్రానికి అప్రతిష్ట తెచ్చే మత్తుమందుల రవాణా జరుగుతోందని, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం గంజాయి -డ్రగ్స్ కు హబ్బుగా మారటం యువత దౌర్భాగ్యం అని.. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని మత్తులో ముంచెత్తిన వైసీపీ మరో చాన్స్ అడగటం సిగ్గుచేటని రామయ్య విమర్శించారు.

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక , మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు గంజాయి డ్రగ్స్ ఏపీ నుంచి వెళుతుంటే.. సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద ఉన్న నిఘా నిద్రపోతుందా ? వారు వాహనాలను తనిఖీ చేయరా? అధికార పార్టీ నేతల రవాణాను, అడ్డగోలుగా అనుమతిస్తారా అని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా సమర్ధుడైన పాలకొడను ఎన్నుకోవలసిన అవసరం యువతకు ఉందని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE