-ఎన్నికల నిర్వహణ పై హైకోర్టు మండిపాటు
– రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో హైకోర్టులో రిట్లు దాఖలు
హైకోర్టులో అనంతపురం,కడప,కర్నూల్ లలో ఈ నెల 26,27 అనగా శని,అదివారాలలో కడప,కర్నూలు, అనంతపురం జిల్లాల బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీకి నిర్వహిస్తున్న ఏన్నికలను అక్రమంగా నిర్వహించే విధానంపై హైకోర్టు మండిపాటు.
హైకోర్టు లో స్థానిక జిల్లాల సభ్యులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన మీదట ఈ జిల్లాలకు సంభందించి “లంచ్ మోషన్ రిట్ పిటిషన్” ల మీద విచారణ చేస్తూ 1964 కో-ఆపరేటివ్ సొసైటీల చట్టప్రకారం మరియు బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బైలాల ప్రకారం ఎన్నికలు నిర్వహించటం లేదని పూర్తి ఆధారాలతో తెలుసుకొని ap.హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మూడు జిల్లాలలో ఎన్నికలను నిలుపుదల చెయ్యమని మధ్యంతర ఉత్తర్వులు ఈ ఉదయం అందచేసింది. ప్రతివాదులుగా 1.ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం (.ప్రిన్సిపల్ సెక్రెటరీ సహకార శాఖ ) 2.కమీషనర్ & రిజిస్ట్రార్ సహకరశాఖ 3.జిల్లా సహకార శాఖ అధికారి 4. చైర్మన్ ,బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఆంధ్ర ప్రదేశ్ 5.మేనేజింగ్ డైరెక్టర్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ 6.సీఈఓ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జిల్లా 7.కలెక్టర్ ప్రతివాదులుగా వున్నారు.
సోమ వారం ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని, 2వారాలకు వాయిదా వేస్తూ, ఎన్నికలు నిలిపివేయాలని ఉత్తర్వులను హైకోర్టు జడ్జ్ శ్రీ కె.శ్రీనివాసరెడ్డి అందజేశారు. వాదులు తరుపున న్యాయవాది చింతలపాటి పాణిని సోమయాజి వాదించారు. ఈ ఉత్తర్వులను ఎవరు అతిక్రమించినా హైకోర్టు ధిక్కరణ కిందకు వచ్చెదరని న్యాయవాది తెలిపారు. దీనిపై రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
నియంతృతంతో ఎవరిని లెక్కచేయకుండా “నేను గీసిందే గీత” అన్నట్లు ప్రవర్తిస్తున్న వారికి ఇది చెంపపెట్టు” అని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ నాయకులు సుగురు రఘునాథరావు, మదనపల్లి గాయత్రి, పసుపుల మురళీకృష్ణ, రాణి శ్రీనివాస్ శర్మ, వేలూరు సుబ్రహ్మణ్యం, గండూరి మహేష్ తదితర నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
బ్రాహ్మణ చైతన్య వేదిక” ఇదే విధంగా సొసైటీ ఎన్నికలు అక్రమంగా నిర్వహించిన గుంటూరు ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం చిత్తూరు జిల్లాల్లో కూడా ఇదేవిధంగా ఈ సొసైటీ ఎన్నికలపై న్యాయపోరాటం చేస్తామని సిరిపురపు శ్రీధర్ తెలిపారు