Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఆంద్రా ద్రోహి కేసీఆర్

-విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా మరో మారు మోసం
-కేసీఆర్ కు వైసీపీ కి ఉన్న అనుబంధం ఏం?
-వైసిపి, టిడిపి ఎంపిలు ఏనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు
-ఆంధ్రా వాసులపై చేసిన కామెంట్లకు క్షమాపణ చెప్పి, ఏపీ లోకి కేసిఆర్ రావాలి
-తెలంగాణా లో అర్టిసి ని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు?
-ఏపీకి రావాల్సి న నీటి వాటాను ఎందుకు ప్రస్తావించలేదు?
-6,400 పైగా పవర్ బకాయిలు ఎపికి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి
-బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు

విజయవాడ : బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కొత్త డ్రామాకు తెరలేపారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తామని అధికారులను పంపిస్తామని ఆంద్రా ద్రోహి కేసిఆర్ మాట్లాడతున్నారు.ఏపీ ని కేసీఆర్ ఇప్పటికీ మోసం చేస్తునే ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా ఎపి ప్రజలను మరో మారు మోసం చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఉన్న మాట వాస్తవమే. కేంద్ర‌మంత్రులకు లేఖలు రాసాము..దానికి వారు రిప్లై ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయం లో వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. కేసీఆర్ కు వైసీపీ కి ఉన్న అనుబంధం ఏం? వైసిపి, టిడిపి ఎంపిలు ఏనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లో ఏపీ ప్రజలు కంట్లో కారం కొట్టారు. నేనే పార్లమెంట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పై మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు భరోసా కల్పించాలని కేంద్రం ఆలోచిస్తుంది.కెసిఆర్ లాగా డబ్బా కొట్టుకోవడానికి మేము పనిచేయడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మేము కష్టపడుతుంటే కేసిఆర్, కెటిఆర్ డబ్బాలు కొట్టుకుంటున్నారు.

తెలంగాణా‌ అప్పుల ఊబిలో కి కారణం కేసిఆర్.కేసీఆర్ ఆస్తులు పెరిగాయి..ప్రజలపై అప్పుల ను నెట్టారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సంస్ధను నిలబెట్టే విధంగా ఉన్నాయి. కెసిఆర్ ఆంధ్రాలో అడుగుపెట్టాలని కలలు కంటున్నారు. ఆంధ్రా వాసులపై చేసిన కామెంట్లకు క్షమాపణ చెప్పి, ఏపీ లోకి కేసిఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నాను.రాజకీయాల అవసరం కోసం ఏపీ కి వచ్చి ఉద్దరిస్తానడం సిగ్గుచేటు. ఏపీకి రావాల్సిన నిధులు చెల్లించాలి. ఎపికి నిధులెందుకు ఇవ్వడం లేదు. మాకు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ధైర్యంగా మిమ్మల్ని అడగదు.. కేసిఅర్ ఏపీ ప్రభుత్వం మధ్య లాలూచీ ఏంటో వారే చెప్పాలి. 6,400 పైగా పవర్ బకాయిలు ఎపికి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి . కేటీఆర్ ఈ విషయం లో ఎందుకు మాట్లాడటం లేదు? విభజన చట్టంలోని న్యాయమైనవి ఎపికి ఇవ్వడం లేదు?

స్టీల్ ప్లాంట్ అమ్మకం లేదు. వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇస్తే కేసిఆర్ అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణా లో అర్టిసి ని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు. 40 శాతం ఇప్పటికే నిర్వీర్యం చేశారు.రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలను ఎందుకు పరిష్కరించలేదో కేసిఆర్ సమాధానం చెప్పాలి. 15 రోజుల్లోగా పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి.ఇక్కడ వైసిపి ప్రభుత్వం ఎలాగో అడగదు. అందుకే నేను అడుగుతున్నా..అప్పుడే ఎపిలో అడుగుపెట్టండి. గతంలో మాట్లాడిన మాటలకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పి ఎపి రాజకీయాలు చేయాలి.ఎపిలో డ్రామాలకు తెరతీస్తే తగిన విధంగా బుద్ధి చెబుతాం.

తెలంగాణాలో సెటిలర్స్ రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కోరుకుంటున్నారు. మీలా దుర్మార్గంగా‌ ఎవరూ ఆలోచించడం లేదు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ హయాంలో ప్రభుత్వం మన ఎంపిల వలన నిలబెడితే, గతంలో స్టీల్ ప్లాంట్ అంశం ఎందుకు గుర్తించలేదు?పదేళ్లు కాంగ్రెస్ చేసిన దుర్మార్గాన్ని గుర్తించరు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, వర్కర్లు గుర్తించాలి..మీరు ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ మీ కళ్లల్లో కారం కొట్టింది. మాయమాటలు చెప్పి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారు.ఏపీకి రావాల్సి న నీటి వాటాను ఎందుకు ప్రస్తావించలేదు? అబద్దాలు నిజం కావు కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు.

LEAVE A RESPONSE