Suryaa.co.in

Andhra Pradesh Telangana

చంద్రబాబులాగా మామను వెన్నుపోటు పొడవగల సమర్ధుడు హరీష్‌రావు

-తెలంగాణ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు అర్ధం లేనివి
-తన మామను తిట్టాలనుకుంటే, నేరుగా తిట్టొచ్చు కదా? మాతో తిట్టించడం ఎందుకు?
-తన మామను తిట్టించేందుకే ఆంధ్రను గిల్లుతాడు
-వైఖరి మార్చుకోకపోతే, ఇంకా గట్టిగా స్పందిస్తాం
-మాపై అంత ప్రేమ ఉంటే, రాయలసీమ లిఫ్ట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-హైదరాబాద్‌ హరీష్‌రావుదో.. వాళ్ల నాయకుడు బండ ప్రకాశందో కాద
-వాళ్లంతా ఇక నోరు మూసుకుంటే మంచిది
-బాబు సభలో ఖాళీ కుర్చీల ప్రభంజనం
-ఖాళీ కుర్చీలతో చంద్రబాబు గంటన్నర మీటింగ్‌
-ఎవరూ లేకున్నా అదే పనిగా సుదీర్ఘ ప్రసంగం
-విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై మా ప్రభుత్వ వైఖరి సుస్పష్టం
-సంస్థను ప్రైవేటీకరించవద్దన్నదే మా ప్రభుత్వ స్టాండ్‌
-చంద్రబాబుకు శ్రీ పేర్ని నాని సవాల్‌

హరీష్‌ గిల్లుడు వ్యాఖ్యలు:
హరీష్‌రావు రాజకీయాల్లో చాలా తెలివైన వ్యక్తి. పదునైన బుర్రతో ఉంటాడు. ఆయన మామ కేసీఆర్‌ దగ్గర మెత్తని కత్తితో తిరుగుతూ ఉంటాడు. అవకాశమొస్తే చంద్రబాబులాగా వెన్నుపోటు పొడవగల సమర్ధుడు. కేసీఆర్‌ రాజకీయ వారసత్వం కొడుకు, కూతురుకో పోతుందని.. ఆయన ముందు మామయ్య అంటూ మెత్తగా ఉంటాడు. ఆయనకు కేసీఆర్‌పై కోపం వచ్చినప్పుడల్లా ఆంధ్ర గురించి కెలుకుతూ ఉంటాడు. మనమేమో హరీష్‌ను అనలేక నేరుగా కేసీఆర్‌ ప్రభుత్వం గురించి మాట్లాడతామనేది ఆయన ప్రయత్నం.
అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్న ఉమ్మడి ఆస్తి హైదరాబాద్‌ను చూస్తే.. అక్కడ ఎలా ఉందో.. ఆంధ్ర పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో రోడ్లు ఎలా ఉన్నాయో.. భద్రాచలం ఎలా ఉందో? చూస్తే.. తెలంగాణలో వాళ్ల పరిపాలన ఎలా ఉందన్నది అర్ధమవుతుంది. అందుకే హరీష్‌రావు తన మామను తిట్టాలనుకుంటే, నేరుగా తిట్టొచ్చు కదా? మాతో తిట్టించడం ఎందుకు? ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కాస్తా టీఆర్‌ఎస్‌ అయ్యింది కదా. మామా అల్లుళ్ల మధ్య ఉన్న తగాదాలే ఇలా తప్పుడు ప్రచారాలకు వేదికగా మారింది.

మీకు నిజంగా ప్రేమ ఉంటే..:
మా ప్రజల మీద వాళ్లకు అంత ప్రేమెందుకు? ఆంధ్రాకు చెందిన వలస కార్మికులను తెలంగాణాలో ఓటర్లుగా చేరమని ఎందుకు కోరుతున్నారు?. నిజంగా మాపై అంత ప్రేమ ఉంటే, రాయలసీమ లిఫ్ట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు? నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించే రకం హరీష్‌రావు, కేసీఆర్‌ అని చెబుతున్నాను. దిండి, పాలమూరు లిఫ్ట్‌ల ఏర్పాటులో వాళ్లకు ఎంత హక్కుందో.. రాయలసీమ లిఫ్ట్‌ ఏర్పాటులో మాకూ అంతే హక్కుంది. ఇక్కడ ఎవరూ దొంగల్లేరు. మా వాళ్ల ఓట్లను మీరేమీ చేర్చుకోనక్కర్లేదు. హైదరాబాద్‌ హరీష్‌రావుదో.. వాళ్ల నాయకుడు బండ ప్రకాశందో కాదు. వాళ్లంతా ఇక నోరు మూసుకుంటే మంచిది అని మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని హెచ్చరించారు.

గతి, మతి తప్పిన చంద్రబాబు:
చంద్రబాబు నిన్న ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పర్యటించారు. పెనమలూరు, పామర్రు, బందరు నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన.. తనకు అర్ధరాత్రి వేళ కూడా జనం నీరాజనం పలికారంటూ చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వ పని అయిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు సభల్లో ఎక్కడా జనం లేరు. ఖాళీ కుర్చీలు తప్ప. ఇక బందరులో జనం అస్సలు లేకపోయేసరికి, షాక్‌కు గురయ్యారో ఏమో.. పార్టీ కార్యకర్తల్లో పట్టుదల మరింత పెరిగిందని తనకు తానే చెప్పుకుంటూ ఖాళీ కుర్చీలతోనే గంటన్నర మీటింగ్‌ కొనసాగించారు.

ఇప్పుడు కేడర్‌ వదిలేసింది:
చంద్రబాబు బందరు మీటింగ్‌ చూసిన తర్వాత మాకొక విషయం స్పష్టంగా అర్ధమైంది. గత ఎన్నికల్లో ప్రజలు బాబును వదిలేశారనుకుంటే 2023 నాటికి పారీ కేడర్‌ కూడా వదిలేసిందని అర్ధమైంది. అయినా చంద్రబాబు మాత్రం నిత్యం తనకు వత్తాసు పలికే పచ్చ మీడియాను నమ్ముకున్నాడు. తన సభలన్నీ సక్సెస్‌ అయ్యాయని పచ్చ పత్రికలతు పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తాయని, పచ్చ టీవీలు తన ప్రసంగాన్ని అదేపనిగా చూపుతాయని, జనం లేకున్నా దాన్ని కనబడనీయరని ఆయనకు తెలుసు. అందుకే ఖాళీ కుర్చీలతోనే మీటింగ్‌ కొనసాగించారు.

అక్కడ తిరిగే అర్హత లేదు:
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు తెగింపే. అసలు బందరుకు ఏం చేశాడని చెప్పి, ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్లాడు. బందరు వచ్చే అర్హత చంద్రబాబుకు లేదని నియోజకవర్గం ప్రజలు అనుకుంటున్నారు.
2014, ఏప్రిల్‌ 18న బందరు వచ్చిన చంద్రబాబు, ఆనాడు ఏ హామీలు గుప్పించారు? చెప్పిన వాటిలో ఏమేం నెరవేర్చారు? అన్నది వారు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే వారంతా బాబును ఒక మోసగాడిగా చూస్తున్నారు. అందుకే చంద్రబాబుకు బందరుకు వచ్చే అర్హత లేదు.

బందరు–బాబు హామీలు:
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఆరు నెలల్లో మచిలీపట్నం పోర్టు కడతామని, రొయ్యల పరిశ్రమతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని, రేపల్లె నుంచి బందరుకు రైల్వే లైన్, ఒకటి రెండు హైవే లైన్ల నిర్మాణంతో పాటు, హైదరాబాద్‌ను తలదన్నే రీతిలో బందరును తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాడు. ఇంకా అక్కడికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తేవడంతో పాటు, పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి, ఒకొక్కరికి రూ.1.50 లక్షల వ్యయంతో ఇళ్లు కట్టిస్తామని నమ్మించాడు. కానీ ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదు. అందుకే చంద్రబాబు ఒక నయవంచకుడని బందరు ప్రజలు అంటున్నారు.

త్వరలో పోర్టు పనులు:
దాదాపు 17 ఏళ్లుగా బందరు ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న మచిలీపట్నం పోర్టును మా ప్రభుత్వం కట్టబోతోంది. బందరు పోర్టు పనులకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైంది. మే మూడో వారంలో బందరు పోర్టు పనులు ప్రారంభమవుతాయి.
ఒక్క ఎకరా భూసేకరణ చేయకుండానే పోర్టు కడుతున్నాం. ఆనాడు అధికారంలోకి రాగానే అర్ధరాత్రి పూట జీవోలు జారీ చేసిన చంద్రబాబు, పోర్టు పేరుతో 22 గ్రామాల్లో దాదాపు 33 వేల ఎకరాల భూములు బలవంతంగా సేకరించాలని చూశారు. దీంతో ఆ గ్రామాలవారు తిరగబడి, కోర్టులను ఆశ్రయించారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా సేకరించకుండానే, రైతుల ప్రయోజనాలు కాపాడుతూ, బందరు పోర్టు నిర్మిస్తోంది.

బందరులో ఏమేం చేశాం?:
చంద్రబాబు తన హయాంలో బందరుకు తీరని అన్యాయం చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక పట్టణానికి ఎన్నో విధాలుగా మేలు చేశాం. అక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన గోల్డ్‌ కవరింగ్‌ పరిశ్రమను ఆదుకున్నాం. ఆ కంపెనీలకు సబ్సిడీపై కరెంటు సరఫరా చేయడంతో పాటు, మంచినీటి సదుపాయం కూడా కల్పించాం. దీంతో గోల్డ్‌ కవరింగ్‌ పరిశ్రమ ఆనందంగా ఉంది. అలా వారంతా ఉపాధి కోల్పోకుండా చూశాం. 25 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్ధలాలిచ్చాం. ఒక్క బందరు మున్సిపాల్టీలోనే 19 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చాం. వారందరికీ ఇళ్లు కూడా నిర్మించి ఇస్తున్నాం.

చంద్రబాబు దగాకోరు రాజకీయం:
బందరులో మేమిన్ని మంచి పనులు చేస్తే, పట్టణాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తే, సిగ్గు ఎగ్గూ లేకుండా అక్కడికి వెళ్లిన చంద్రబాబు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ, దగాకోరు రాజకీయం చేస్తున్నారు. పులివెందుల బస్టాండ్‌ కూడా సీఎంగారు కట్టలేదు అనడానికి అసలు ఆయనకు నోరెలా వచ్చిందో?. చంద్రబాబు నీకు కళ్లుంటే, ఒకసారి పులివెందుల వెళ్లు. అక్కడ బస్టాండ్‌ ఎలా కట్టారో చూడు. చివరకు గంజాయిపైనా చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కానీ, ‘గంజాయి సాగులో ప్రపంచంలోనే ఏపీ నెం.1గా ఉంది. దాన్ని కట్టడి చేయలేకపోతున్నాం’ అని నాడు చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న గంటా శ్రీనివాసరావు స్వయంగా అన్నారు. అది గుర్తు లేదా? రాజధాని పేరిట ప్రజల సొమ్మును హల్వా చేశారు. రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా చేసిన బాధ్యుడు చంద్రబాబు కాదా? రాజధాని పేరిట చంద్రబాబు, ఆయన అనుయాయులు, అప్పటి మంత్రి నారాయణ.. అంతా కలిసి ప్రజల సొమ్ముతో పాటు, రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా హల్వాలా తినేశారు. ఎక్కడా శాశ్వత భవనాలు కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల్లోనూ అంతులేని అవినీతి. వర్షం వస్తే కారే అసెంబ్లీ, సచివాలయ భవనాలు. అదీ చంద్రబాబు నిర్వాకం.

చర్చకు వస్తావా?:
‘నేను నీతులు చెప్పే నాని’ ని అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొల్లు రవీంద్ర ఇచ్చిన చీటీలతో లేనిపోని ఆరోపణలతో మాట్లాడటం మంచిది కాదు బాబు. ఇప్పటి వరకు నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. చంద్రబాబు చేసిన ఆరోపణలతో నాకు ఏ మాత్రం సంబంధం లేదు.
అందుకే బాబూ, నీకు దమ్మూ, ధైర్యం ఉంటే నాతో చర్చకు రా. విజయవాడలో అయినా సరే. లేదా మరెక్కడైనా సరే. రండి. చర్చ పెడతాం. నాపై మీ ఆరోపణలు నిరూపిస్తారా?.

ఎందుకంత కడుపు మంట?:
నిరుపేదలకు మేలు చేస్తే ఎందుకంత కడుపు మంట? ఈ 46 నెలల్లో బటన్‌ నొక్కి పలు పథకాల ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా నిరుపేదల ఖాతాల్లో జమ చేయడాన్ని చంద్రబాబు తప్పు పడుతున్నారు. నిరుపేదలను ఆదుకుంటే చంద్రబాబుకు ఏమిటి అభ్యంతరం? వారు బాగు పడొద్దా? చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల దోపిడి. ఇక ఒక్క నీరు–చెట్టు కార్యక్రమంలోనే ఏకంగా రూ.2 వేల కోట్లు దోచేశారు.

బాబు రాష్ట్రానికి పట్టిన శని:
తన ప్రభుత్వ హయాంలో బందరుకు ఏం పొడిచేశారని మళ్లీ టీడీపీని అధికారంలోకి తేవాలట?. చంద్రబాబు ఒక దరిద్రుడు. ఆయన రాష్ట్రానికి పట్టిన శని. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో ప్రజలంతా సంతోషంగా ఉంటే.. ఓర్చుకోలేకపోతున్న చంద్రబాబు, సీఎంగారిపై పిచ్చి విమర్శలు చేస్తున్నాడు.

ఆ దమ్మూ ధైర్యం ఉన్నాయా?:
రాష్ట్రానికి మేలు జరగాలంటే తమను గెలిపించాలంటున్న చంద్రబాబు, మా ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తానని వంచించే మాటలు చెబుతున్నాడు. నిజానికి ఆయన తన పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. కానీ రాష్ట్రానికి ఎంతో చేశానని చెప్పుకుంటున్నాడు. అందుకే ఈరోజు నేను ఒక ఛాలెంజ్‌ చేస్తున్నాను. చంద్రబాబుకు నిజంగా దమ్మూ, ధైర్యం ఉంటే.. గతంలో మాదిరి (2014–2019 మ«ధ్యలో) పాలనను మళ్లీ తెస్తామని, అదే జన్మభూమి కమిటీలతో సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ఎన్నికలకు రాగలరా?.

అప్పుల్లోనూ అబద్ధాల బాబు:
రాష్ట్ర అప్పులపైనా చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర అప్పులు రూ. 3.5 లక్షల కోట్లు అని కేంద్రం చెబుతోంది. అందులోనూ రూ. 2 లక్షల కోట్లు నాడు చంద్రబాబు ప్రభుత్వం చేసినవే. అంటే మా ప్రభుత్వం కేవలం రూ. 1.5 లక్షల కోట్లు అప్పు మాత్రమే చేసింది. ఇదే నిజాన్ని ఆర్బీఐ, కేంద్రం రెండూ చెబుతున్నాయి. మేం చేసిన అప్పులకు పక్కా లెక్క ఉంది. కానీ, ఆనాడు చంద్రబాబు చేసిన అప్పులకు ఇప్పటికీ లెక్క లేదు.

చంద్రబాబు ఒక సైకో:
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొని, ఆయనను మానసిక క్షోభకు గురి చేసి చివరికి మరణానికి కూడా కారణమైన వ్యక్తిని సైకో అనకూడదా? అందుకే, చంద్రబాబు నోటి వెంట సైకో అనే పదం పలకలేక సైకిల్‌ పోవాలంటున్నాడు.

స్టీల్‌ ప్లాంట్‌ అమ్మొద్దు:
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దన్నది మా స్టాండ్‌. ఆ ప్లాంట్‌ కొనసాగించేందుకే మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాం. సంస్థను ఎలా పునరుద్ధరించవచ్చు, ఏం చేస్తే లాభాలబాటలోకి మళ్లించ వచ్చన్న దానిపై కేంద్రానికి నివేదించాం. ప్లాంట్‌ను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇది సత్యం.

హరీష్‌ గిల్లుడు వ్యాఖ్యలు:
హరీష్‌రావు రాజకీయాల్లో చాలా తెలివైన వ్యక్తి. పదునైన బుర్రతో ఉంటాడు. ఆయన మామ కేసీఆర్‌ దగ్గర మెత్తని కత్తితో తిరుగుతూ ఉంటాడు. అవకాశమొస్తే చంద్రబాబులాగా వెన్నుపోటు పొడవగల సమర్ధుడు. కేసీఆర్‌ రాజకీయ వారసత్వం కొడుకు, కూతురుకో పోతుందని.. ఆయన ముందు మామయ్య అంటూ మెత్తగా ఉంటాడు. ఆయనకు కేసీఆర్‌పై కోపం వచ్చినప్పుడల్లా ఆంధ్ర గురించి కెలుకుతూ ఉంటాడు. మనమేమో హరీష్‌ను అనలేక నేరుగా కేసీఆర్‌ ప్రభుత్వం గురించి మాట్లాడతామనేది ఆయన ప్రయత్నం.
అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్న ఉమ్మడి ఆస్తి హైదరాబాద్‌ను చూస్తే.. అక్కడ ఎలా ఉందో.. ఆంధ్ర పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో రోడ్లు ఎలా ఉన్నాయో.. భద్రాచలం ఎలా ఉందో? చూస్తే.. తెలంగాణలో వాళ్ల పరిపాలన ఎలా ఉందన్నది అర్ధమవుతుంది. అందుకే హరీష్‌రావు తన మామను తిట్టాలనుకుంటే, నేరుగా తిట్టొచ్చు కదా? మాతో తిట్టించడం ఎందుకు? ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కాస్తా టీఆర్‌ఎస్‌ అయ్యింది కదా. మామా అల్లుళ్ల మధ్య ఉన్న తగాదాలే ఇలా తప్పుడు ప్రచారాలకు వేదికగా మారింది.

మీకు నిజంగా ప్రేమ ఉంటే..:
మా ప్రజల మీద వాళ్లకు అంత ప్రేమెందుకు? ఆంధ్రాకు చెందిన వలస కార్మికులను తెలంగాణాలో ఓటర్లుగా చేరమని ఎందుకు కోరుతున్నారు?. నిజంగా మాపై అంత ప్రేమ ఉంటే, రాయలసీమ లిఫ్ట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు? నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించే రకం హరీష్‌రావు, కేసీఆర్‌ అని చెబుతున్నాను. దిండి, పాలమూరు లిఫ్ట్‌ల ఏర్పాటులో వాళ్లకు ఎంత హక్కుందో.. రాయలసీమ లిఫ్ట్‌ ఏర్పాటులో మాకూ అంతే హక్కుంది. ఇక్కడ ఎవరూ దొంగల్లేరు. మా వాళ్ల ఓట్లను మీరేమీ చేర్చుకోనక్కర్లేదు. హైదరాబాద్‌ హరీష్‌రావుదో.. వాళ్ల నాయకుడు బండ ప్రకాశందో కాదు. వాళ్లంతా ఇక నోరు మూసుకుంటే మంచిది అని మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని హెచ్చరించారు.

LEAVE A RESPONSE