తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా అంజనీ కుమార్ నియమితులయ్యారు. కొత్త డీజీపీ వచ్చే వరకూ ఆయనే ఇన్చార్జి డీజీపీగా వ్యవహరిస్తారు. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తాజా నియామకం ప్రకారం.. కొత్త డీజీపీ కూడా ఆయనే అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు.అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్ గా పని చేశారు.ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు.ఐక్యరాజ్య సమితి తరపున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు.బీహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు.ఐపీఎస్ ట్రైనింగ్ లో మంచి ప్రతిభ కనపబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు.
గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు.కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఛీఫ్ గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఛీఫ్ గా పనిచేశారు.నిజామాబాద్ డీఐజీగా చేశారు.వరంగల్ ఐజీగా చేశారు.
హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గా చేశారు.తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు.2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్ గా చేరారు.2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు.రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు.హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధనలు చేశారు.