ఎట్లా అయితే తమిళ్షులు తమ తమిళ్ష్ భాషకు మహాకవి సుబ్రమణియ బారతియార్ (సుబ్రహ్మణ్య భారతియార్)ను ప్రతీకగా చేసుకున్నారో ఆ తీరులో మహోన్నతమైన కవి-తాత్త్వికుడు అన్నమయ్యను తెలుగుభాషకు ప్రతీకగా మనం నిలుపుకోవాలి.
అన్నమయ్య నిజమైన తెలుగు ప్రజాకవి!
ప్రజాకవి అన్న విషయంలో తెలుగులో ఉన్నట్టుగా బుద్ధి మాంద్యం మరో భాషలో లేదు!
తెలుగులో ఎలాంటి వాళ్లయితే ప్రజాకవులు అని అయ్యారో అలాంటి వాళ్లు దేశ భాషల్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజాకవులు అవలేదు; అవరు. తెలుగుభాషలో మాత్రమే ఈ దుస్థితి ఉంది. ఈ దోషాన్ని, ఈ దుస్థితిని మనం తొలగించుకోవాలి.
అన్నమయ్య ప్రపంచ స్థాయి మహోన్నత కవి!
అన్నమయ్య అంతర్జాతీయ తెలుగు ప్రజాకవి!!!
లోగడ కొన్ని సందర్భాల్లో అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి కవిత్వాన్ని సోదాహరణంగా తెలియజేశాను.
అన్నమయ్య సనాతన మూర్తిమత్వం; అన్నమయ్య భారతీయతాకృతి.
అన్నమయ్య తెలుగు కవితా సౌభాగ్యాల అయ్య!!!
‘అన్నమయ్య తెలుగుభాష ప్రతీక’ అవాల్సిన అవసరం ఉంది.
ఆధికారికంగా అన్నమయ్యను తెలుగుకు ప్రతీకగా ప్రకటించాలని మాన్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంగా కార్యచరణ చెయ్యాలని నా సవినయ విజ్ఞప్తి.

9444012279