– వెంకటాచలం మండలంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకులు
– నెల్లూరులోని జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కు చక్రధర్ బాబుకు ఫిర్యాదు, ఆధారాలు అందజేసి సమగ్ర విచారణతో భూదందాలకు అడ్డుకట్ట వేయాలని విన్నవించిన నేతలు
– నిష్పక్షపాతంగా విచారణ జరిపి కుంభకోణం వెనుక ఉన్న డాన్ లను కూడా బయటకు లాగి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్
బొమ్మి సురేంద్ర… టీడీపీ రాష్ట్ర కార్యదర్శి:సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కొని వేల ఎకరాల భూ దందా జరుగుతోంది.భూ కుంభకోణాలపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోకపోతే మరో నెల రోజుల్లో ఇంకా ఎక్కువ భూ కుంభకోణాలు జరిగే అవకాశం ఉంది.
గతంలో పొదలకూరు తహసీల్ధారుగా పని చేసిన స్వాతి భూ కుంభకోణాలకు పాల్పడి సస్పెండ్ అయింది. ఆమెను ఉద్యోగం నుంచే పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.పొదలకూరు మండల టీడీపీ నాయకులు ఇచ్చిన ఆధారాలతో స్వాతి సస్పెండ్ అవ్వడం జరిగింది.10 ఆధారాలు ఇస్తే వాటిలో 8 నిజమని నిర్ధారించారు.
వెంకటాచలం మండలం కాకుటూరులో కూడా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్లు గతంలో ఫిర్యాదు చేశాం.ఇప్పుడు కూడా కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి.వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను కలెక్టర్ కు తెలియజేశాం.వెబ్ ల్యాండ్లో ఈజీగా మార్పులు చేస్తూ తాసీల్ధార్ లు అక్రమాలకు పాల్పడుతున్నారు.అధికార పార్టీ నాయకుల ఆదేశాలతోనే ఈ భూ కుంభకోణాలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయ్.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.వెంకటాచలం మండలంలో నాలుగు ఎకరాల పట్టా భూములు ఉన్నవారికి సైతం తహసీల్ధార్ సీలింగ్ భూములను దారదత్తం చేసి అక్రమాలకు పాల్పడ్డారుబడుగు,బలహీన వర్గాలకు మంజూరు చేసిన అసైన్డ్ భూములను వారి వద్ద నుంచి లాక్కుని వేరే వాళ్లకు ఇచ్చే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు.తక్షణ చర్యలు చేపడితే జరగబోయే భూ దందాలకు అడ్డుకట్ట పడుతుందని తెలియజేశాం.ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరాం.
తిరుపతి పార్లమెంట్ రైతు అధ్యక్షులు రావూరు రాధాకృష్ణమ నాయుడు:
వెంకటాచలంలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశాం.సరైన ఆధారాలతో సహా జరిగిన కుంభకోణం పూర్తి వివరాలు తెలియజేశాం.వెంకటాచలం మండలంలో ఎస్సి, ఎస్టీ ల్యాండ్ సీలింగ్ కింద కేటాయించిన భూములను అర్ధాంతరంగా రద్దు చేసి భూస్వాములకు కట్టబెడుతున్నారు.వెంకటాచలం మండల తాసీల్ధార్ స్థానిక నాయకులు ప్రోద్బలంతో ఈ అక్రమాలకు పాల్పడుతూ అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడు.
గతంలోనే ప్రస్తుత వెంకటాచల తాసీల్ధార్ పై పలు ఫిర్యాదులు వచ్చిన ఆర్డీఓ, కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపినట్లు అర్ధమవుతోంది.ఉన్నతాధికారుల మద్దతు తోనే తాసీల్ధార్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయ్.జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి తాసీల్ధార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.ఇష్టం వచ్చినట్లు చట్టానికి విరుద్ధంగా గ్రావెల్ తరలించేందుకు ఎన్ఓసి మంజూరు చేయడంతో కోట్ల రూపాయల గ్రావెల్ అక్రమంగా తరలిపోయింది.ప్రస్తుతం పెద్ద భూస్వాములకు డి పామ్ పట్టాలు,ఎన్ఓ సి ఇచ్చి వాటిని అమ్ముకునే అధికారాలు కట్టబెటేందుకు కుట్రలు జరుగుతున్నాయి.
కొన్ని కోట్ల రూపాయల భూములు అక్రమంగా చేతులు మారిపోతున్నాయికలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణం స్పందించి క్షుణమైన దర్యాప్తు జరపితే వందల ఎకరాల భూ కుంభకోణం వెలుగులోకి వస్తుంది.పొదలకూరు గత తాసీల్ధార్ స్వాతి చరిత్ర అందరికి తెలుసు…ఎలాంటి భూ అక్రమాలకు పాల్పడిందో…దానికంటే ఐదు, ఆరు రెట్లు భూ కుంభకోణం వెంకటాచలం మండలంలో జరిగింది.వెంకటాచలం మండలంలో మంజూరైన ఇళ్ల పట్టాల పంపిణీలో కూడ భారీ అవినీతి జరిగింది.ఈ కొంభకోణాల వెనుక పెద్ద డాన్ లు ఉన్నారు…పూర్తి విషయాలు అన్ని త్వరలోనే బయటికొస్తాయ్.క్షేత్రస్థాయిలో పూర్తి దర్యాప్తు జరిగితే ఎంత మంది ఉన్నారో…ఎన్ ఓ సి లతో ఎంత భూ కుంభకోణం జరిగిందో వెలుగులోకి వస్తుంది.కార్యక్రమంలో సర్వేపల్లి నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.