నాటుసారా మరణాలపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణం

– జంగారెడ్డి గూడెం ఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలి – టీడీపీ ఎమ్మెల్సీలు..
– బాబాయ్ మరణం గొడ్డలిపోటుఅయితే, గుండెపోటు అన్నారు. అదేపంథాలో సారామరణాలను సహజమరణాలుగా చిత్రీకరిస్తున్నారు.
– 4గంటలు పట్టుబట్టినా సమయం వృథాచేశారుతప్ప, జంగారెడ్డిగూడెం ఘటనపై మండలిలో చర్చించడానికి పాలకులు ముందుకురాలేదు.
– శవరాజకీయాలపై ట్రేడ్ మార్క్ జగన్ రెడ్డిది. శవరాజకీయాల బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి.
– శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి, తండ్రి శవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి పీఠంకోసం ప్రయత్నించాడు, బాబాయ్ శవంతో ఓట్లుపొందాడు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ,నారా లోకేష్

ప్రజలసమస్యలకు సంబంధించి అత్యవసరసమస్యలు, ఇబ్బందులు తలెత్తిన ప్పుడు చర్చకోసం సభలో వాయిదాతీర్మానం ప్రవేశపెడితే దాన్ని తిరస్కరిస్తారా? జంగారెడ్డిగూడెం నాటుసారాఘటనలో 25మంది చనిపోతే దానికంటే ప్రభుత్వానికి అర్జెన్సీ అంశం ఏముంది? ఘటనపై మండలిలో చర్చిద్దామంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది?

25మంది చనిపోయారు.. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి.. భార్యాపిల్లలు దిక్కులేనివాళ్లు అయ్యారయ్యా అంటుంటే శవరాజకీయాలు అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.
శవరాజకీయాలపై పేటెంట్ ఉంది జగన్ రెడ్డికే. శవరాజకీయాల ట్రేడ్ మార్క్, వాటికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. తండ్రిశవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రికావడంకోసం సంతకాలు సేకరించింది ఎవరు.. జగన్ రెడ్డి.

సొంతబాబాయ్ కి గొడ్డలిపోటువేసి, దాన్నిబూచిగా చూపించి ప్రజలనుంచి ఓట్లు పొందింది జగన్ రెడ్డి. మండలిలో మేం వాయిదా తీర్మానం ఇస్తే, దానిపై వాళ్ల వెర్షన్ వాళ్లుచెప్పుకుంటూ, చదువుతుంటే మేంవినాలంటా?

మీకంటే, నాకంటే కూడా శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డేనని ప్రజలకు బాగాతెలుసు. జంగారెడ్డిగూడెం ఘటనపై మేం చర్చజరగాలి అంటున్నాం. ప్రభుత్వం చేసే ఉత్తుత్తిప్రకటనలుకాదు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటలవరకు పట్టుపట్టినా నాటుసారా మరణాలపై చర్చించడానికి ప్రభుత్వానికి ఎందుకంతభయం? 4గంటలు తాముపట్టుబట్టేలా చేయకపోతే, నాటుసారామరణాలపైచర్చించాక, బడ్జెట్ ప్రసంగంపై చర్చకుపోతే బాగుండేది కదా..!

22,500కోట్లను ప్రజల నుంచి మద్యం అమ్మకాలద్వారా వసూలు చేయడమేనా మద్యపాననిషేధమంటే?: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, శాసనమండలి సభ్యులు జీ.దీపక్ రెడ్డి
నాటుసారా తాగిమరణించిన 25మంది చావులకు ప్రభుత్వమే కారణమంటూ తాము మండలిలో వాయిదా తీర్మానంఇచ్చాము.సమస్యపై చర్చించాలని గట్టిగా పట్టుబట్టాము. చర్చకోసం మండలిఛైర్మన్ ను, ప్రభుత్వాన్ని అరగంటపాటు రిక్వెస్ట్ చేశాము.అయినాకూడా ప్రభుత్వం మండలిని 4సార్లువాయిదా వేసింది తప్ప, తామిచ్చిన వాయిదాతీర్మానంపై చర్చకు ముందుకురాలేకపోయింది.నాటుసారా మరణాలపై మండలిలో చర్చించడానికి ప్రభుత్వానికి ధైర్యంలేదు.

కనీసం మేంలేవనెత్తే ప్రశ్నలకు సమాధానంచెప్పే ధైర్యంకూడా ఈప్రభుత్వానికి లేకుండాపోయింది.25మంది చనిపోయాక, ఘటనపై వాయిదాతీర్మానం సరైన ఫార్మాట్ లోనే ఇచ్చినాకూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం.
అసెంబ్లీ స్పీకర్ గాఉన్న తమ్మినేని సీతారామ్ స్వయంగా రెండేళ్లక్రితం ఒకమాటచెప్పారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని, నాటుసారా అమ్మకాలు పల్లెల్లో విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవ్యక్తే నేరుగా మద్యంఅమ్మకాలు, నాటుసారా విక్రయాలపై మాట్లాడినా ప్రభుత్వం స్పందించలేదు.
గతంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలను సభలో ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, స్పందన లేదు.ఎన్నికల సమయంలో ప్రచారంచేస్తూ జగన్మోహన్ రెడ్డి మద్య పాననిషేధం గురించి చెప్పింది నిజంకాదా?
మద్యపాననిషేధం అనిచెప్పి ప్రజల ఓట్లుపొందిన వ్యక్తి, నేడు తనప్రభుత్వాన్ని మద్యంపైవచ్చే ఆదాయంతోనే నెట్టుకొ స్తున్నాడు.ఇదేనా ఆయన ఇచ్చినవాగ్ధానాన్ని నిలబెట్టుకోవడం.మరీ దారుణంగా ప్రభుత్వమే బరితెగించి, మద్యంతయారీ, పంపిణీ, అమ్మకాలు కూడా సాగిస్తోంది.
ఆఖరికి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులను మద్యందుకాణాలవద్ద కాపలాపెట్టే దుస్థితికి ఈప్రభుత్వం దిగజారిందంటే అంతకంటే సిగ్గుమాలినతనం మరోటి ఉందా?ప్రభుత్వమే స్వయంగా నాసిరకం మద్యం తయారుచేస్తూ అమ్ముకోవడం దారుణంకాదా?
పిచ్చిమద్యాన్ని అధికధరలకు అమ్ముతుండటంతో రాష్ట్రసరిహద్దుల్లోని పొరుగురాష్ట్రాల మద్యందుకాణాలకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగిపోయింది. మద్యపాననిషేధంలో భాగంగానే రేట్లు తగ్గించామని చెప్పుకున్నవారే, మరలా రివర్స్ పాలసీ అమలుచేసి రేట్లు, మద్యందుకాణాలు పెంచేశారు.
హీనాతీహీనంగా తమఆదాయం పెంచుకోవడం కోసం చివరకు కరోనాసమయంలో కూడా మద్యందుకాణాలు నడిపారంటే ప్రభుత్వవైఖరి ఏంటో అక్కడే అర్థమవుతోంది.
ప్రజలను ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారో.. అన్నిరకాలుగా ఇబ్బందిపెట్టారు.స్థానికసంస్థల ఎన్నికలసమయంలో మద్యంసీసాలను తీసుకెళ్లి ప్రతిపక్షఅభ్యర్థుల ఇళ్లల్లో పెట్టి, వారిని అక్రమంగా అరెస్ట్ లు చేయించారు.
మద్యంగురించి మాట్లాడుతుంటే, ఈ ప్రభుత్వంలో ఎందుకు చలనంలేదునాటుసారాదెబ్బకు 25మంది చనిపోతే సహజ మరణాలంటూ తప్పించుకోవాలని చూస్తారా? టీడీపీఅధికారంలో ఉన్నప్పుడు మూడో సంవత్సరంలో కేవలం రూ.4600కోట్లుమాత్రమే మద్యంఅమ్మకాల ద్వారా ఆదాయం వచ్చింది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లుఅయ్యింది.వారిపాలనలో మూడోఏడాది మద్యంపై వచ్చిన ఆదాయం రూ.22,500కోట్లు వస్తోంది. దాదాపు 544శాతంవరకు మద్యంధరలుపెంచారు.దానికితగినట్టే ఆదాయం పెరిగింది.
టీడీపీ ప్రభుత్వహాయాంనాటికి, ఇప్పటికి 406శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. ఏస్థాయిలో ఈ ప్రభుత్వం అమ్మకాలుసాగిస్తే ఆదాయం ఇంతలా పెరిగిందని ప్రశ్నిస్తున్నాం?ఈ ప్రభుత్వం చెప్పేదొకటి..చేసేదొకటని ప్రజలు గుర్తించాలి.
ప్రజలను దారుణంగా వంచిస్తూ, వారికి ఎదురయ్యేసమస్యలపై చర్చించడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది.తాము మండలిలో ఎంతగాపట్టుబట్టినా, ఎంతకోరినా జంగారెడ్డిగూడెం ఘటనపై ప్రభుత్వం చర్చకుముందుకురాలేదు.

చనిపోయినవారంతా బడుగు, బలహీనవర్గాలవారని ముఖ్యమంత్రి జంగారెడ్డిగూడెం ఘటనను చిన్నచూపు చూస్తున్నాడు: టీడీపీ శాసనమండలి సభ్యులు, బీటీ.నాయుడు
నాటుసారాతో సంభవించిన 25మరణాలపై బాధ్యతగల ప్రజాప్రతినిధులుగా తాము మండలిలో మాట్లాడకూడదా?
25మందిచనిపోవడం అనేది సాధారణ విషయంకాదు. మండలికి వచ్చిన మంత్రులు, వైసీపీఎమ్మెల్సీలు తమపైనే విమర్శలు చేశారు.
చనిపోయిన 25మంది బడుగు, బలహీనవర్గాలవారని ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి చిన్నచూపా? అలాంటి ఘటనలే మంత్రులఇళ్లల్లో జరిగిఉంటే, వారు ఇలానే స్పందిస్తారా?తమవారిప్రాణాలు కాపాడుకోవడానికి విమానాల్లో పరిగెత్తేవారు.
చనిపోయినవారంతా బడుగు, బలహీనవర్గాలనే ముఖ్యమంత్రి స్పందించడంలేదు.25మంది చనిపోతే సభలో 5నిమిషాలు కూడా చర్చించరా?
ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలప్రాణాలతో చెలగాటమాడుతూ, ప్రజలను ఎంతహీనంగా చూస్తున్నారో ఇప్పటికైనా వారు అర్థంచేసుకోవాలని కోరుతున్నాం.జంగారెడ్డి గూడెం ఘటనలో మరణించిన వారికుటుంబాలకు ప్రభుత్వం న్యాయంచేయాల్సిందే.
జరిగిన ఘటనకు నైతికబాధ్యతవహిస్తూ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామాచేయాలి. జంగారెడ్డిగూడెం ఘటనపై న్యాయవిచారణ జరిపించి, మృతులకుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.25లక్షలపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రభుత్వమే మద్యాన్ని అధికధరకు అమ్ముతుంటే, జంగారెడ్డిగూడెం లాంటి ఘటనలు రాష్ట్రమంతా జరుగుతాయి: టీడీపీ శాసనమండలి సభ్యులు, అంగర రామ్మోహన్
పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో 25కుటుంబాలు నాటుసారాకు బలైతే, ఒకమహిళ స్వయంగా తనభర్త ఎందుకు చనిపోయాడో కన్నీటి పర్యంత మవుతూ వాపోయింది.సారావ్యాపారాన్ని ముఖ్యమంత్రి , ఆయనపార్టీశ్రేణులు కుటీరపరిశ్రమగా మార్చుకున్నాడు.
ముఖ్యమంత్రి చెప్పిన దశలవారీ మద్యపాన నిషేధం జరగదని తేలిపోయింది. షాక్ కొట్టేరేట్లు ఇస్తే మద్యఅమ్మకాలు తగ్గుతాయని జగన్ రెడ్డిచెప్పారు. కానీ ఆధరలదెబ్బకే రాష్ట్రంలో నాటుసారా, ఇతర మాదకద్రవ్యాలఅమ్మకాలు పెరిగాయి.
ఒక్కరోజులోనే రూ.165కోట్ల మద్యం అమ్మకాలు సాగించడమేనా మద్యపాననిషేధం చేయడమంటే?జగన్మోహన్ రెడ్డి తక్షణమే జంగారెడ్డిగూడెం మృతులకుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించినట్టే సారామరణాలను సహజమరణాలుగా వక్రీకరిస్తున్నారు: టీడీపీ శాసనమండలి సభ్యులు బీ.టెక్. రవి
25మంది చనిపోయారు సార్..దానికంటే ముఖ్యమైన అంశం ఇంకోటిలేదుసార్ .. దానిపై చర్చజరిగేలా చూడండని పట్టుబట్టినా, బతిమాలినా మండలిలో చర్చకు తాముఇచ్చిన వాయిదాతీర్మానాన్ని ఛైర్మన్ గారు తీసుకోలేదు.
ప్రభుత్వం ఇలా ఎందుకు పారిపోతోంది?పులివెందులలోనేమో గొడ్డలిపోటుని గుండెపోటని చెప్పి ప్రచారంచేశారు.జంగారెడ్డిగూడెంలోని సారామరణాలను సహజమరణాలని ఇప్పుడు ప్రచారంచేస్తున్నారు.
ఇప్పుడు ఎలాగైతే జంగారెడ్డిగూడెం అంశాన్ని సభలో చర్చకురాకుండా ప్రభుత్వం అడ్డుకుందో, గతంలో కూడా వివేకాహత్య వ్యవ హారం జనాలకు తెలియకూడదని చేయాల్సిందంతా చేశారు.
కానీ ఇప్పుడు సదరు హత్యతాలూకా వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకువస్తుంటే, దానివెనకున్నవారికి చెమటలుపడుతున్నాయి.వివేకాహత్యకేసు వ్యవహారంలో అన్నివేళ్లు ముఖ్య మంత్రి వైపే చూపిస్తున్నాయి. 1978 నుంచి జగన్ రెడ్డి కుటుంబాన్ని గెలిపిస్తున్న పులివెందులప్రజలకు వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉంది.

Leave a Reply