పెనుకొండలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్యాంటీన్‌ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు శ్రీమతి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి సవిత క్యాంటీన్లోనే భోజనం చేసి, అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో ముచ్చటించారు. భోజనం రుచి, నాణ్యత గురించి అడిగి తెలుసుకోగా, ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 5 రూపాయలకే కడుపు నిండా మంచి భోజనం అందుతున్నందుకు ప్రభుత్వం పై కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇలాంటి క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు.