కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మారాలని 90% నిజమైన కాంగ్రెస్ వాదులు కోరుతున్న మాట వాస్తవం
కానీ.. ఏడెనిమిది సంవత్సరాలు అన్న కనుసన్నల్లో నడిచి, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడంలో భాగస్వామి అయిన వ్యక్తి షర్మిలారెడ్డి. ధన దాహం,అధికారదాహం అధికంగా గల మహిళ షర్మిలారెడ్డి. తెలంగాణలో లంగా నాయకులను వెంటబెట్టుకుని, స్వంత పార్టీ పెట్టి, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ నాయకులను నోటికొచ్చిన భాషలో నిందించి, కాంగ్రెస్ పార్టీ వినాశనాన్ని కోరిన వ్యక్తి షర్మిలారెడ్డి.
తెలంగాణ ప్రజలు ఛీ కొట్టి పారద్రోలగా,నానా తంటాలు పడి, తండ్రి పేరు చెప్పుకుని కాంగ్రెస్ పంచన చేరిన వంచన జీవి షర్మిలారెడ్డి. ఈమె ఏదో ఊడబొడుస్తుందని నమ్మి, లొట్టలేసుకుంటూ డిల్లీ చేరి ,అధిష్టానాన్ని ఒప్పించి ఈమెకు పదవిని ఇప్పించిన వారు రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులమంటూ, ముట్టే బిగబట్టి వ్యవహరించిన సో కాల్డ్ పెద్దలు. షర్మిల దెబ్బకు గూబ గొయ్యిమని ఎవరికొంపలో వారు చేరి గుడ్లగూబల్లా తొంగి చూస్తున్నవారు కూడా ఈ పెద్దలే.
ప్రస్తుత తరుణంలో నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తున్నది. నాయకత్వ మార్పు అనివార్యం. సామాన్య కార్యకర్తల ఆర్తనాదాలు ఢిల్లీ వరకు చేరవు. చేరినా పట్టించుకునే నాధుడే లేడు. కనుక షర్మిలను నాయకురాలిగా కూర్చోబెట్టిన సీనియర్ నాయకులే ఈ మార్పుకు కావలసిన వ్యూహాన్ని రచించి, అధిష్టానాన్ని ఒప్పించి, సమర్ధ నాయకత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అందించి, తాము చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. పదవులు చెట్లకు కాయవు, నిజాయతీగా పని చేస్తేనే లభిస్తాయి.
– వెంకటయ్య నెలకుదిటి
9989999514.