– రేవంత్ రెడ్డి గారు.. ఎందుకు నీకు నిరుపేద వర్గాలు అంటే కక్ష?
– ఏమంత మెరుగైన పాలన అందిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి దొర?
– రాజ్యాంగ నిబంధనలు పాటించడం నీ బాధ్యత కదా?
– జివో 7ను వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి
– గతంలో లాగా విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయాలి
– బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి
హైదరాబాద్ : ఆర్ధిక వెనుకబాటు తనంలో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశ పెట్టారు. ఇంటర్ నుండి పోస్ట్ మెట్రిక్ చదివే వారికి లక్షలాది మంది విద్యార్థులకు బోధన కోసం ఈ పథకం ప్రవేశ పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఫీజ్ రియాంబర్స్మెంట్ పథకం మరింత పటిష్టంగా అమలు చేశారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం అమలు చేశారు. విద్యార్థులు చదివేందుకు మాత్రమే కళాశాలలో చేరడం కానీ, తర్వాత ఆర్థిక పరమైన విధానంలో ప్రభుత్వం చేస్తూ వస్తుంది. 2023 ఎన్నికల సమయంలో ప్రభుత్వం రైతు భరోసా మేము పెంచి ఇస్తామని చెప్పారు.ఇప్పుడు ఏమవుతుందో అందరికీ తెలుసు. విద్యా పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో, సర్టిఫికెట్ లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు
చివరికి కళాశాల యాజమాన్యం కోర్టుకు వెళ్ళాయి. బకాయిలు వసూలు కోసం యాజమాన్యాలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేసుకోవాలి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఆర్థిక భారం లేకుండా కళాశాలలో చదివే వారు.
మేము డైరెక్ట్ గా విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ చేస్తాం అంటూ ప్రభుత్వం జివో ఇచ్చింది. ఇది కరెక్ట్ కాదు.ఫీజ్ రీయింబర్స్మెంట్ డైరెక్ట్ గా కళాశాలకు చెల్లించే స్తోమత లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. దానికి సంబంధించిన ఆర్థిక భారం మీరే భరించండి అంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? ఎన్నికల ప్రణాళిక లో ఏం పేర్కొన్నం. కళాశాలలో ఫీజ్ రియాంబర్స్మెంట్ పథకం ఇంకా మెరుగైన రీతిలో చేస్తాం అన్నారు. కేసీఆర్ మీద కోపం ఉన్నట్లు అయితే, ఈ పథకం ప్రారంభం చేసింది వైఎస్సార్. ఆయన కోసం అయిన కొనసాగించాలి.
రేవంత్ రెడ్డి గారు.. ఎందుకు నీకు నిరుపేద వర్గాలు అంటే కక్ష? రాజ్యాంగ నిబంధనలు పాటించడం నీ బాధ్యత కదా? విద్యా,వైద్యం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు.. వైద్యం కు సంబంధించి కూడా ఆరోగ్య శ్రీ మరింత పటిష్టం చేయాలని కేసీఆర్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 33జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో వైద్య విద్యా కాలేజ్ లు ఏర్పాటు చేశారు వైద్య విద్యా కాలేజ్ లతో లతో పాటు సూపర్ స్పెషాలిటీ కళాశాలలు ఏర్పాటు చేశారు. టీమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. అవి అన్ని కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
గత పాలన కంటే మెరుగైన పాలన కొనసాగించాలి. కానీ రేవంత్ రెడ్డి కి అది సాధ్యం కాదు. రైతు భరోసా రెండు దఫాలు ఎగొట్టారు. రుణమాఫీ 2లక్షల లోపు చేస్తానని ఎగొట్టారు. రైతు పెట్టుబడి కూడా ఎగ్గొట్టారు. చదువు అనేది దేశ భవిష్యత్తు. తెలంగాణ ఏర్పాటు కు మూలం విద్యనే.అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యా వైద్యం అందించాలని కేసీఆర్ ఆలోచన చేశారు.
ఏమంత మెరుగైన పాలన అందిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి దొర? రేవంత్ కి ఫోర్త్ సిటీ తప్ప ఇంకోటి కనిపించదు. కనిపిస్తే హైడ్రా లేదా ఫోర్త్ సిటీ. జివో 7ను వెంటనే ఉపసంహరణ చేసుకోవాలని బిఆర్ ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. గతంలో లాగా విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయాలి. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. నీవు ఇంకా రెండేళ్లు నివు ఉంటావో నీ ప్రత్యర్థులు ఉంటారో కాంగ్రెస్ ప్రభుత్వం ను భరించాలి. జాబ్ క్యాలెండర్ ప్రదానం అన్నారు, శాసన సభ వేదికగా చెప్పారు.
మొదట 2లక్షల ఉద్యోగాలు అన్నారు. తర్వాత లక్ష న్నారు తర్వాత 60 వేలు అన్నారు కానీ చివరకు ఇచ్చింది కేవలం 17వేల ఉద్యోగాలు మాత్రమే. రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మరు అని రైతు డిక్లరేషన్ ప్రకటన కోసం రాహుల్ గాంధీని వరంగల్ పట్టుకొని వచ్చాడు. అలాగే జాబ్ క్యాలెండర్ కోసం రాహుల్ గాంధీ నీ అశోక్ నగర్ పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ పోతాడా?
10వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జివో 7 ఉపసంహరణ చేసుకొని గతంలో మాదిరిగా ఫీజ్ రియాంబర్స్మెంట్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రేపు విద్యా సంవత్సరం ఆరంభం కానున్నది. రాహుల్ గాంధీ ఇక్కడ జరుగుతున్న పాలన తెలిసి రాలేదా? వరంగల్ రైతు డిక్లరేషన్ కోసం వచ్చాడు.ఇప్పుడు అమలు అయిందా? రాహుల్ గాంధీ తెలుసా? నిరుద్యోగ యువత కు ఏం చేశాడు.ఫీజ్ రియాంబర్స్మెంట్ రాష్ట్ర భవిష్యత్తు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు.
1994 సంవత్సరం లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి పడుతుంది. రేవంత్ రెడ్డి పోవాలి. కేసీఆర్ రావాలి. ఇది ప్రజల్లో వస్తున్న డిమాండ్. దాన్ని ఎవరు ఆపలేరు.సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.