– నిన్న బెంగాల్.. రేపు తెలంగాణ
– ప్రధాని మీటింగ్ కి మల్కాజిగిరి పార్లమెంటు నుండి లక్షమంది హాజరుకాబోతున్నారు
– తెలంగాణలో అధికారంలోకి వచ్చేంతవరకు బీజేపీ అలసిపోదు
– మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
సికింద్రాబాద్: నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయడానికి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో నిన్న ఎనిమిది మీటింగులు పెట్టుకున్నాము. అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లో ఉన్న వారందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈరోజు పొద్దున ఎల్బీనగర్ నియోజకవర్గం, మధ్యాహ్నం మేడ్చల్ అర్బన్ జిల్లా, సాయంత్రం కంటోన్మెంట్ లో సమావేశాలను ఏర్పాటు చేసుకున్నాం.
ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 365 రోజులు ప్రజలకు సేవ చేసే వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ. అలాంటి వ్యక్తిని ఆశీర్వదించండి అని తెలంగాణ ప్రజలను కోరుతున్నాము. ప్రజలు మేధావులు విద్యార్థులు కులసంఘాలనేతలు, కాలనీలవాసులు అందరూ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ కి హాజరుకావాలని విన్నపంగా విజ్ఞప్తి చేస్తున్నాము.
మా నాయకులందరూ కూడా ప్రజలను ఇంట్లో పెళ్ళి లెక్క ఆహ్వానించాలని కోరుతున్నాము. 7 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అధికారిక కార్యక్రమంలో ప్రజలకు అంకితం చేయనున్నారు. పెరేడ్ గ్రౌండ్ లో జరిగేది పూర్తి స్థాయి రాజకీయ సమావేశం.
పశ్చిమ బెంగాల్లో రెండు సీట్ల నుంచి ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలసిపోము. అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా.. ఒక్క అడుగుతో మొదలవుతుంది. బిజెపి ప్రస్థానం రెండు పార్లమెంటు సభ్యులతో మొదలై అప్రతిహతంగా కొనసాగుతుంది. కంటోన్మెంట్ సమస్యలను రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్రంలో అన్ని అధికారాలు ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర ఉన్నట్లు కేంద్రంలో ఉండదు. ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు పరిష్కారాలు అందిస్తున్నారు.