Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ కు మరో షాక్…

కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ .. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు షాకిచ్చారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు ఆయన రాజీనామా చేశారు. కారు దిగిన ఆయన… హస్తాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో… ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరుకుంది.

LEAVE A RESPONSE