– గతంలో వెయ్యి తగ్గించిన సర్కారు
– ఈసారి ఆ కోతను రెండు వేలకు
అమ్మ ఒడి పథకం క్రింద ఇస్తున్న రూ.15 వేలల్లో ప్రభుత్వం మరో వెయ్యి రూపాయలు కోత విధించనుంది…. మరుగుదొడ్ల నిర్వహణ పేరిట గతంలో వెయ్యి తగ్గించిన సర్కారు… ఈసారి ఆ కోతను రెండు వేలకు పెంచింది.
కుటుంబంలో బడికి వెళ్లే చిన్నారులు ఉన్న ప్రతి తల్లికీ… విద్యార్ధికి ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు గొప్పగా ప్రకటించిన జగన్… అధికారంలోకి వచ్చాక కుటుంబంలో ఒక విద్యార్ధకి మాత్రమే పథకాన్ని పరిమితం చేయడమే కాక…రెండో ఏడాది నుంచి స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1,000 కోత పెట్టి 14 వేలు చేతిలో పెట్టారు. ఇక, ఇప్పుడు రూ.2000 తగ్గించి పథకాన్ని రూ.13 వేలకు కుదించారు. ఈ 2 వేలను పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగించాలని సర్కారు నిర్ణయించింది.