Suryaa.co.in

Features

జర్నలిజం ముసుగులో హిందూ వ్యతిరేక శక్తులు

-“ప్రశ్నించే గొంతు కాదు .. హిందూ సమాజంపై విద్వేషం మీది “
-హిందుత్వంపై ఎందుకింత కక్ష..?
-మీడియాలో జాతీయవాదులు పెరుగుతుంటే ఓర్చుకోలేకే సెమినార్లు
-మీరు రాసిందే వార్త.. చూపిందే న్యూస్ అనుకోవడం పొరపాటు
-హిందుత్వంపై.. భారతీయం పై బురద జల్లడం మానుకోవాలి
-మేధావి ముసుగులో జాతి విద్రోహ కలాపాలకు కాలం చెల్లింది..
-జర్నలిజం పేరుతో హిందుత్వం పై దాడిని అడ్డుకొని తీరుతాం
-మీడియాలో పుష్కలంగా పెరుగుతున్న
-జాతీయవాద జర్నలిస్టుల సంఖ్య
-జీర్ణించుకోలేని భారతీయ వ్యతిరేక శక్తులు

దేశంలో హిందుత్వానికి ఆదరణ పెరుగుతున్న కొద్దీ.. హిందూ వ్యతిరేక శక్తులు జీర్ణించుకోలేక పోతున్నాయి. పైగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. జర్నలిజం ముసుగులో హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడటం.. భారతీయతను తప్పుగా చిత్రించడం ముమ్మాటికి పొరపాటు. “ఇన్నాళ్లు మేం రాసిందే వార్త .. మేము చూపిందే న్యూస్” అన్నట్టు వ్యవహరించిన కమ్యూనిస్టు ముసుగు తొడిగిన జర్నలిస్టులకు నేడు సోషల్ మీడియా ఆధారంగా వాస్తవాలు బయటికి రావడం కడుపు మంటగా మారింది.

సంబంధం లేని సమస్యలపై గగ్గోలు చేస్తూ.. సెమినార్ల పేరుతో తమను తాము ప్రమోట్ చేసుకోవడం వారికి కొత్తదేమీ కాదు. హిందుత్వంపై.. జాతీయవాదం పై దాడి చేసేందుకు జర్నలిజం ముసుగు తొడగడం దారుణం. ఈ దేశం అస్తిత్వం.. ఈ దేశ సంప్రదాయంపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ధర్మంపై.. సంస్కృతి పై దాడి జరిగితే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు కూడా హిందూ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మేధావుల ముసుగు తొడిగి..భారతీయ వ్యతిరేక భావజాలం కలిగిన జర్నలిస్టులు గుర్తు చేసుకోవాలి.

“ప్రశ్నించే గొంతు కాదు .. హిందూ సమాజంపై విద్వేషం మీది “అనే విషయం గుర్తు చేసుకోవాలి. “జర్నలిజం- ట్రోల్ ముఠాలు” అంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విద్వేషం చిమ్మడం తప్ప చేసింది ఏమీ లేదు. మనసు నిండా హిందూ వ్యతిరేకత భావం నింపుకొని మేధావి మాటలు మాట్లాడడం సీనియర్ జర్నలిస్టులకే చెల్లింది. “భారతీయతపై విదేశీ భావజాలం.. హిందుత్వంపై విద్వేషపు జర్నలిజం” మాటలు తప్ప అక్కడ చేసింది ఏమీ లేదు. తప్పు చేసిన వారు చట్టం చేతిలో శిక్ష అనుభవిస్తారు తప్ప.. హిందుత్వంపై, నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తే శిక్షలు పడవు అనే విషయాన్ని మేధావులు గుర్తు చేసుకుంటే బాగుంటుంది.

విశ్వ గురువుగా అవతరిస్తున్న భారత్ పై విదేశీ భావజాలం గల మేధావులు విషం చిమ్మవచ్చు.. కానీ హిందుత్వాన్ని ఏమాత్రం కట్టడి చేయలేరని విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నేడు పెరుగుతున్న సాంకేతిక పురోగతి ఆధారంగా.. ప్రతి ఒక్కరూ తమ భావజాలం ప్రదర్శించే అవకాశం వెలుగులోకి వస్తోంది. దీంతో ఇన్నాళ్లు కట్టడి చేసిన హిందుత్వ భావజాలం నేడు ప్రతి పౌరుడు తెలుసుకుంటున్నారు. ఈ విషయం జర్నలిస్టు ముసుగులో ఉన్న హిందూ వ్యతిరేకులకు తలనొప్పిగా మారి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప వాస్తవమైన జర్నలిజం కోసం కాదు అనే విషయం సమాజం గుర్తించింది.

నేడు వందలాది మీడియా సంస్థలలో వేలాదిగా భారతీయ భావజాలం.. హిందుత్వ భావజాలం కలిగి ఉన్న జర్నలిస్టులు పనిచేస్తున్నారు. రాబోవు రోజుల్లో ఈ సంఖ్య పుష్కలంగా పెరుగుతుంది. ఇది శుభసూచకం. ఎవరు ఎన్ని సమావేశాలు పెట్టి హిందుత్వం పై బురద చల్లినా కూడా.. జాతీయ వాద జర్నలిస్టుల ఆరంగ్రేటాన్ని ఏ శక్తి ఆపలేదు అనే విషయం గుర్తు చేసుకుంటే బాగుంటుంది.

జర్నలిస్ట్ సోదరి తులసి చందు ను కించపరిచే విధంగా ఎవరు పోస్ట్ పెట్టినా చట్టపరంగా బాధ్యులు శిక్షార్హులే. తులసి చందు కూడా ఎలాంటి రాతలు రాసిందో దానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

– పగుడాకుల బాలస్వామి
అధ్యక్షులు
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)
9912975753
9182674010

LEAVE A RESPONSE