– విశ్వహిందూ పరిషత్
హిందూ వ్యతిరేక .. భారత జాతీయ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న జిహాది మూకలను అంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది.హర్యానా రాష్ట్రంమేవాత్ ప్రాంతంలో హిందువుల శోభాయాత్ర పై జరిగిన దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్త ఆందోళన దిగింది.
అందులో భాగంగానే బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు వివిధ నగరాలు, కూడళ్లలో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రముఖ కేంద్రాలలో జిహాదీ మూకల దిష్టిబొమ్మలను దహనం చేసింది.
ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్ మాట్లాడుతూ..హర్యానా రాష్ట్రం నూహ్ జిల్లా, నంద గ్రామం వద్ద ముస్లిం మూకలు హిందూ యువకుల పై అకారణంగా దాడికి దిగడం దుర్మార్గమన్నారు. ప్రతి శ్రావణ మాసంలో హిందువులు పవిత్రంగా బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర నిర్వహించడం సాంప్రదాయం. ఈ సంప్రదాయం పాండవుల కాలం నుంచి వస్తున్నదని, అందులో భాగంగానే ఏటా ఈ శోభయాత్రను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
అయితే ఈ యాత్రను భగ్నం చేసేందుకు కోసం జిహాదీముకలు ఘోరమైన దాడికి పాల్పడటం, దాదాపు వేలాదిమంది హిందువులను ఊచకోత కోసేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగించే అంశం అన్నారు. హిందువులందరూ ఆలయంలోకి చేరుకోగానే పథకం ప్రకారం కొండలు, గుట్టల్లో దాచి ఉన్న రాళ్లు.. బాంబులను విసిరేసి బీకరం సృష్టించారని వాపోయారు. రాళ్ల వర్షం కురిపించడం.. పెట్రోల్ బాంబులతో బీభత్సం చేయడం క్షణాల్లో జరిగిపోయిందన్నారు.
అంతటితో ఆగకుండా భక్తులు వచ్చిన వాహనాలను, పోలీసు వెహికిల్స్ సైతం తగలబెట్టి బుగ్గిపాలు చేశారన్నారు. ఇద్దరు బజరంగ్దళ్ కార్యకర్తలను ఘోరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు భక్తులు, హోంగార్డులు కూడా చనిపోవడం బాధాకరమని విశ్వహిందూ పరిషత్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని.. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.