Suryaa.co.in

Telangana

‘సాలు మోదీ.. సంపకు మోదీ’.. మోదీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో వెలసిన పోస్టర్లు

జులై 2న ప్రధాని మోదీ హైదరాబాద్ కు వస్తున్న సంగతి తెలిసిందే. జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ‘బైబై మోదీ’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అంటూ వీటిపై రాశారు.

రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్, నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమేనని యువత కడుపు కొట్టినవ్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్, హఠాత్తుగా లాక్ డౌన్ అని గరీబోల్లను చంపినవ్, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ. 15 లక్షలు ఏవి?, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్ అంటూ ఫ్లెక్సీలపై రాశారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీవాళ్లే వీటిని ఏర్పాటు చేశారని అంటున్నారు. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

LEAVE A RESPONSE