- చంద్రబాబు నాయుడు, లోకేశ్ లపై విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే
- నిజాలు ప్రసారం చేసిన మీడియాపై బూతులు దుర్మార్గం
- ధర్టీ వీడియోపై ధర్టీ పార్టీ చర్యలు తీసుకోకపోవటంలో అతియోశక్తి లేదు
- జగన్ రెడ్డి ఎస్పీలను డమ్మీలుగా మార్చారు
- పంచుమర్తి అనురాధ
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పాడు పని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ప్రయత్నించటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…..
నిన్న ప్రెస్ మీట్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పశువు కంటే హీనంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీ.ఆర్ నాయుడులను బూతులు తిట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఘన చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. చంద్రబాబు, లోకేశ్ లపై వైసీపీ నేతలు విమర్శలు చేయటం అంటే ఆకాశంపై ఉమ్మి వేయడమే. గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు రోజా, కారుమూరి నాగేశ్వరరావు ప్రయత్నించటం సిగ్గుచేటు. దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 788 మందికి మాత్రమే ఎంపీలయ్యే అవకాశం దక్కింది. అలాంటిది ఒక ఎంపీ ప్రజలకు దిక్సూచిగా వ్యవహరించాలి. కానీ మాదవ్ వ్యవహార తీరు పార్లమెంట్ కే వ్యవస్ధకే కళంకం తెచ్చింది. న్యూడ్ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా పవిత్రమైన తిరుపతిలో అతని నగ్న వీడియోను, అసభ్య ప్రవర్తనను సమర్ధిస్తూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టడం వైసీపీ నీచ సంసృతిని తెలియజేస్తోంది.
గోరంట్ల మాధవ్ పోలీసుగా పని చేసే సమయంలో అతనిపై సెక్షన్ 506, 156,302, 376 తో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులున్నాయి. వీటిలో సుమారు 6 నెలల నుంచి జీవిత ఖైదు కూడా పడే కేసులున్నాయి. రేఫ్ కేసు, మర్దర్ కేసులున్న వెదవకి ఎంపీ టిక్కెట్ ఇచ్చిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదే. అధికారం, అరాచకం కలిస్తే ఎలా ఉంటుందో జగన్ రెడ్డి పాలన చూస్తే ప్రజలకు అర్దమవుతోంది. చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా కులం పేరుతో రాజకీయాలు చేస్తారా? బీసీ కులం అయితే తప్పులు చేయెచ్చా…నేను బీసీ కులానికి చెందిన దానినే. ఎంపీ స్దాయిలో ఉన్న వ్యక్తి పాడు పని చేసి సిగ్గులేకుండా దానికి కులం రంగు పులుముతారా? గోరంట్ల మాధవ్ బీసీ కులాలకే కళంకం తెచ్చారు. ఫోరెనిక్స్ నివేదిక తర్వాత చర్యలుంటాయన్న సజ్జల, హోంమంత్రి మంత్రులు మాటలు ఏమయ్యాయి? ఎస్పీ మాత్రం ఒరిజనల్ వీడియోని మాత్రమే పోరెనిక్స్ ల్యాబ్ కి పంపగలమని, ఇది ఎడిటింగ్ వీడియో అని దీన్ని పోరెనిక్స్ ల్యాబ్ కి పంపలేమని అంటున్నారు. అంటే ఇన్ డైరక్టన్ ఒరిజినల్ వీడియో ఉందని ఎస్పీ ఒప్పుకున్నారు. హోం మంత్రి మాటలకు ఎస్పీ మాటలకు ఏ మాత్రం పొంతన లేదు. ఎంపీ అనే వారు ప్రజలకు మార్గదర్శికి ఉండాలి, తన నియోజవర్గ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకపోగా మాధవ్ కియా పరిశ్రమ యజమానుల్ని బెదిరించి ఆ కంపెనీనీ తరిమేశారు. రాష్ట్రంలో ఏం జరిగినా ఇది ఇష్యూ కాదని వైసీపీ నేతలు తేలిగ్గా తీసిపారేస్తున్నారు. రాష్ట్రంలో రోజూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇది ఇష్యూ కాదా? ఎంపీ కూడా ఇంత నీచంగా ప్రవర్తిస్తే ఇది ఇష్యూ కాదా? రాష్ట్రంలో గంజాయి మాఫియా చెలరేగిపోతోంది, ఇది ఇష్యూ కాదా? మీ దృష్టిలో పెద్ద ఇష్యూ అంటే ఏంటి? ఒక ఎంపీ మహిళల పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తించినా చర్యలు లేవంటే ఇక మహిళల్ని వేదించే ఆకతాయిలకు ఏం భయముంటుంది? వైసీపీలోని మహిళా ఎంపీలు ఏం చేస్తున్నారు? మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కనీసం పార్లమెంట్ కి లేఖలు రాయాల్సిన బాధ్యత లేదా? ధర్టీ వీడియోపై ధర్టీ పార్టీ చర్యలు తీసుకోకపోవటంలో అతియోశక్తి లేదు.
గతంలో ఎస్వీబీసీ చైర్మన్ పృద్వీ రాజ్ పై వెంటనే చర్యలు తీసుకున్నారు, మరి మాధవ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా కులం పేరుతో రాజకీయాలు చేస్తారా? గోరంట్ల మాధవ్ రాజంపేట మల్లూరు లో ఎస్సైగా పనిచేసినపుడు ఎస్సీ మహిళను గర్బవతిని చేసి ఆ బిడ్డను చంపి కె.సి కెనాల్ లో పడేసిన కేసులో కర్నూలు పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైల్లో వేయటం వాస్తవం కాదా? ఎస్సీ మహిళను మోసం చేసినపుడు గోరంట్ల మాధవ్ కి కులం గుర్తుకు రాలేదా? జగన్ రెడ్డి ఐపీయస్ లను డమ్మీలను చేశారు, దళిత యువకుడి సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేలా తూ.గో ఎస్సీ మాట్లాడారు, నెల్లూరు కోర్టులో కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు పైల్ దొంగతనం కేసులో కుక్కలు తరుముకుంటే నిందితులు కోర్టులోకి పరుగెత్తారంటూ నెల్లూరు ఎస్పీ కధ చెప్పారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలోనూ అనంతపురం ఎస్పీ తప్పుడు ప్రకటనలిస్తున్నారు. పోలీసు వ్యవస్ధను జగన్ రెడ్డి ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు. ఇదేనా పరిపాలన అంటే? 75 ఏళ్ల స్వంతత్ర్యం సంధర్బంగా దేశం మొత్తం అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతుంటే వైసీపీ మాత్రం రాష్ట్రంలోని మహిళలకు న్యూడ్ వీడియోను కానుకగా ఇచ్చింది.
గతంలో మాజీ గవర్నర్ తివారీపై ఆరోపణలు వస్తే ఆయన రాజీనామా చేశారు? ఎంపీపై ఆరోపణలు వస్తే రాజీనామా చేయరా? జగన్ రెడ్డి రాఖీ పండుగ నాడైనా గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటారని మహిళలు భావించారు. కానీ జగన్ రెడ్డి మాధవ్ ని వెనకేసుకొస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ , బిల్ క్లింటన్ నుంచి అబ్డుల్ కలాం వంటి మేదావులతో వేధిక పంచుకున్న ఘన చరిత్ర ఏంటో జగన్ రెడ్డి నేర చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. బూతులు తిట్టి సమస్యపు పక్కదారి పట్టించుకోవాలనుకోవటం దుర్మార్గం. కష్టపడి పైకి ఎదిగిన ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడులను మాధవ్ ఇష్టానుసారం బూతులు తిట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు ఎంపీ పదవి కోసం గోరంట్ల మాధవ్ లాగా ఎవరి కాళ్లో పట్టుకున్న వ్యక్తులు కాదు. మహిళల్ని వేధింపులకు గురి చేసిన మాధవ్ ని వెనకేస్తున్న జగన్ రెడ్డిని మహిళా లోకం క్షమించదని, మాధవ్ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేవరకు మహిళా లోకం ఊరుకోదని ఖబడ్డార్ వైసీపీ అంటూ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.