– 3 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక చిక్కీ గురించి మాట్లాడితే స్ధాయికి దిగజారారు
– పోలవరంలో కమీషన్లు తీసుకోవటం తప్ప పోలవరం గురించి జగన్ కి ఏం తెలుసు ?
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
టీడీపీపై, చంద్రబాబు నాయుడు మీద ఇష్టమొచ్చినట్లు అవాకులు,చవాకులు మాట్లాడితే సహింబోమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. .సజ్జలరామకృష్ణారెడ్డీ ఖబడ్డార్, చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజునాడు హిందూసంప్రదాయం ప్రకారం, కనకదుర్గమ్మ గుడికి వెళ్లి, రాష్ట్రాన్ని పునర్నిర్మించే శక్తిసామర్థ్యాలు తనకుప్రసాదించాలని, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఒకనాయకుడిగా, ఈ యొక్క రాచపీనుగుల ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అమ్మవారి ఆశీస్సులు, సహకారం అవసరమనినమ్మి, అమ్మవారిని ప్రార్థిస్తే , దానికి వక్రభాష్యాలు చెబుతావా ?
చంద్రన్న అమ్మవారిని ప్రార్థించడంపై వక్రభాష్యాలు చెబుతున్న సజ్జలా… నీ కులమేంటి… మతమేంటి? ఒక్క మతసాంప్రదాయమైనా పాటించేకనీసపు బుద్ధైనామీకుందా? ప్రధానమంత్రి, దేశహోంమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుసైతం దైవాశీస్సులకోసం గుడికివెళ్లినప్పుడల్లా తమకు తగిన శక్తిసామర్థ్యాలు ప్రసాదించమని కోరుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నదే. కనకదుర్గమ్మ గుడికి వెళ్లినా.. సింహాద్రి అప్పన్న దర్శానికి వెళ్లినా, తిరుపతి వేంకటేశ్వరస్వా మి వారివద్దకు వెళ్లినా అలాకోరుకుంటూనే ఉంటారు.
అంతమాత్రాన సజ్జల చెప్పిన వక్ర భాష్యాల గురించి ఆలోచిస్తే, ప్రధానమంత్రి మొదలు అలాప్రార్థించేవారందరికీ శక్తిసామర్థ్యాలు లేవనిచెప్పడమే ఆయన ఉద్దేశమా? హోంమంత్రి అమిత్ షా గారికి కూడా శక్తిసామర్థ్యాలు లేవని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా శక్తిసామర్థ్యాలు లేవేమో అని చెప్పడమే సజ్జల ఉద్దే శమా? 7లక్షలకోట్ల రూపాయల అప్పులుచేసి, వృద్ధులకు రూ.3వేల పింఛన్ ఇవ్వలేని ప్రభు త్వానికి సజ్జల సలహాదారుగా ఉన్నారు. చంద్రన్న ఆనాడు పేదలకు 5 రూపాయలకే భోజనం పెడితే, అధికారంలోకి వచ్చాక 7 లక్షల కోట్ల అప్పులుచేసి కూడా పేదలకు భోజనం పెట్టలేక చేతులెత్తేసిన ప్రభుత్వానికి మీరొక సలహాదారు. సగంసగంభోజనం పెడుతూ, ఇంటర్ విద్యార్థుల కడుపుమాడుస్తున్న ప్రభుత్వానికి మీరొకసలహాదారు.
ప్రతిఎకరాకు నీరివ్వాలన్న ఉన్నతాశయంతో పోలవరం పనులు 71శాతంవరకు పూర్తిచేసిన చంద్రన్నను హర్షించకపోగా, కమీషన్లకు కక్కుర్తిపడి, పోలవరాన్ని అడ్డంపడేసి, రైతులనడ్డివిరిచిన ప్రభుత్వానికి మీరొక సలహాదారుడు. అలాంటి మీరా చంద్రన్నగురించి మాట్లాడేది?
చంద్రబాబును విమర్శించే అర్హత సజ్జలకు ఉందా? గ్రానైట్ బిజినెస్ చేసుకునేవారు. ఎక్కడ ఏం లాలూచీలుఉన్నాయో మొత్తానికి వై.ఎస్.కుటుంబంతోసన్నిహితంగా మెలిగారు. ఉదయం పేపర్ నుంచి అన్నిపేపర్ల లో పనిచేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి, అలావచ్చిన అవినీతిసొమ్ముతో పెట్టిన సాక్షిపత్రికస్థాపిస్తే, దానికి డైరెక్టర్ గా, ఎడిటర్ గా వ్యవహరించారు. అసలు ఏంటి మీ చరిత్ర? 14 సంవత్సరాలుముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని విమర్శించే అర్హత మీకుందా అని ఆలో చించరా? మీ స్థాయి ఏంటి?
పోలీస్ స్టేషన్ల ముందే మహిళలపై అఘాయిత్యాలకుపాల్పడున్నాస్పందించని అసమర్థ ప్రభుత్వానికి మీరు సలహదారులు. అలాంటి మీరు చంద్రబాబుగురించి మాట్లాడతారా? చంద్రబాబుగారు మతిభ్రమించి మాట్లాడుతున్నారా? రాజకీయంగా కొంచెమైనా సిగ్గుందా సజ్జలా మీకు? బడుగుబలహీనవర్గాలకు వేదికగా ఉన్న ఈ తెలుగుదేశంపార్టికి, ఎన్టీఆర్ తరువాతనుంచి అనేకసంవత్సరాలనుంచి పార్టీకి అధ్యక్షత వహిస్తూ, బడుగుబలహీనవర్గాలను రాజకీయ ఆరంగేట్రం చేయించిన ఈ తెలుగుదేశంపార్టీకి అధ్యక్షతవహిస్తున్న చంద్రబాబుగారికిమతిభ్రమించిందా? బడుగు, బలహీనవర్గాలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించి, రాజకీయంగా వారినిఉన్నతస్థానాల్లో నిలబెట్టి, చట్టసభల్లో వారి గొంతుకను వినిపించేలా చేసిన చంద్రబాబునాయుడిగారికి మతిభ్రమించిందా?
రిజర్వేషన్లకు కోతపెట్టి, 16వేలమంది బీసీలను రాజకీయంగా ఎదగకుండాచేసిన వ్యక్తి జగన్ రెడ్డి. లోటు బడ్జెట్లో సైతం రూ.65వేలకోట్లుఖర్చుపెట్టి, ప్రాజెక్టులు పూర్తిచేసిన వ్యక్తి, రాష్ట్రానికిజీవనాడి అయిన పోలవరాన్ని 71శాతంపూర్తిచేసిన వ్యక్తి, ఇండస్ట్రీలు తీసుకొచ్చి 15లక్షలమందికి ఉపాధిక ల్పించిన వ్యక్తి, విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రరాష్ట్రాన్నిఅభివృద్ధిపథంలో నడిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మతి భ్రమించింది సజ్జలా.. మీకు , మీ నాయకుడికి. వివేకానందరెడ్డి హత్యకేసులో ఒకడొచ్చి గుండెపోటు అంటాడు..ఒకడొచ్చి కత్తిపోటు అంటాడు.. ఒకడొచ్చి ఈడ్చేశారు మాకుతెలియదు అంటాడు..అలా నోటికొచ్చినట్లు మీలో, మీపార్టీలో మాట్లాడుతున్న ఎంతమందికి మతిభ్రమించిందో ప్రజలకు అర్థమవుతోంది సజ్జల .
మీలో ధైర్యముంటే, దమ్ముంటే వివేకానందరెడ్డిహత్య గురించి మాట్లాడగలరా? ఏంసేవ చేశారని, ఈమూడేళ్లు ఏంచేశారని మాట్లాడుతున్నారు. ప్రజలను వారి మానానవారిని బతకనీయకుండా, వారిని బ్రతికున్నశవాలుగామార్చిన మీరు.. మీప్రభుత్వం చంద్రబాబుగురించి మాట్లాడతారా? అసలు మీరు కడుపుకు అన్నమే తింటున్నారా.. గడ్డి తింటున్నారా..లేక ఇంకే దైనా తింటున్నారా? ఇంకేదైనా అనేమాట కూడాతక్కువే. మీ ప్రభుత్వంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో చెప్పండి. దానిగురించి మాట్లాడే దమ్ము, ధైర్యం సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా? ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న చేనేత భవనం రాత్రికి రాత్రి నాశనంచేశారు. 50ఏళ్లనుంచి ఉన్న భవనాన్ని నేలకూల్చి రాక్షసానందం పొందుతున్న మీరు.. మీప్రభుత్వం చంద్రబాబుగురించి మాట్లాడతారా?
చంద్రన్నగురించి అంతదారుణంగా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇంకోసారి హద్దులు మీరి మాట్లాడితే మర్యాదదక్కదని హెచ్చరిస్తున్నాను. సజ్జలా.. ఎవడన్నాబుద్ది, జ్ఞానం ఉన్నవాడు కుటుంబంతో కలిసి వెంకన్న దర్శనంకోసం వెళుతున్నవారి కారుపట్టుకెళతారా? ముఖ్యమంత్రి కాన్వాయ్ లోకి కావాలంటూ, ఆకుటుం బాన్ని రోడ్డుమీద వదిలేసి కారు లాక్కెళతారా? ప్రపంచచరిత్రలో ఎక్కడన్న ఉందా ఇలాంటి సంఘటన?
ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి తనప్రభుత్వంలో సాగుతున్న మద్యంమాఫియా గురించి మాట్లాడ గలడా? సౌత్ ఆఫ్రికా, టాంజానియాలో ఏపీలో సాగుతున్న మద్యంమాఫియాతో ఎవరెవరికి లింకులున్నాయో మాట్లాడగలడా? టాంజానియా ప్రెసిడెంట్ అక్కడుండి వ్యాపారాలు చేస్తున్న వైసీపీవారిని వెళ్లగొట్టిన దానిగురించి సజ్జల మాట్లాడాలి. మీమీద ఎందుకు 31 క్రిమినల్ కేసులున్నాయో దానిగురించి మాట్లాడండి. ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఛీకొడుతున్నారో దానిగురించి నోరుతెరవండి.
అసలు ఇవన్నీకాదండీ…ముందుమీ ముఖ్యమంత్రిని బయటకువచ్చి ప్రెస్ మీట్ పెట్టి, పదినిమిషాలపాటు పోలవరం గురించి బయటకు వచ్చి మాట్లాడమనండి. పోలవరంపై డిబేట్ చేయమనండి.. ఒక్కతప్పుకుడా లేకండా పోలవరంపై మీ ముఖ్యమంత్రి మాట్లాడితే రాజకీయంగా సన్యాసం తీసుకుంటాను. ఇదే నా ఛాలెంజ్. రమ్మనండి.. కమీషన్లు తీసుకోవడం తప్ప, ఏమైనా మాట్లాడగలరా?
నేర్చుకునేతత్వం లేదు.. ఒకచదివే తత్వంలేదు… ఒకవిశ్లేషణచేసే తత్వంలేదుమీకు. పొద్దునలేస్తే సాక్షిపేపర్లో అడ్వరటైజ్ మెంట్లు ఇచ్చుకోవడం, కోట్లుకోట్లుపోగేసుకోవడం తప్ప, సిమెంట్ రేట్లుపెంచేసుకోవడం.. మీ సిమెంట్ ఫ్యాక్టరీలకోసం కోట్లుకోట్లు సంపాదించుకోవడం తప్ప, ఏంచేస్తున్నారు? మీ నిర్వాకాలనుప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఇలాంటి నీతిమాలిన పనులకుపాల్పడుతుందికాక, పుట్టినరోజునాడు గుడికి వెళ్లొచ్చిన వ్యక్తిని పట్టుకొని ఇన్నిమాటలు మాట్లాడతారా? మీ వ్యాఖ్యలను మీ విచక్షణకే వదిలేస్తున్నా . ఏంచేశారండీ చంద్రబాబుగారు.. మీరేచెప్పారుకదా, అసెంబ్లీసాక్షిగా ఆయన హాయాంలో యువతకు లక్షలాదిఉద్యోగాలుఇచ్చాడని. చనిపోయిన గౌతమ్ రెడ్డి గారు స్వయంగా ఒప్పు కున్నది వాస్తవం కాదా? ఈ మూడేళ్లలో ఏంచేశారుచెప్పండి? చంద్రబాబుగారు 71శాతంపూర్తిచేసినపోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన నిర్వాసితులకు ఏమైనాచేశారా? నిర్వాసితులకోసం చంద్రబాబుగారు కట్టిం చినఇళ్లను మేంకట్టించామంటూ సిగ్గులేకుండా రెండోసారి రిబ్బన్లు కట్ చేసుకున్నారు.
సజ్జల క్రియేషన్స్ అని మీకు ఒకటుంది కదా.. మీరేంచేశారో. మీకుమీరుగా చూసుకోవడానికి ఆ క్రియేషన్స్ పేరుతో ఒక సినిమా తీసుకోండి. ఉప్పుకి, పప్పుకి పనికిరాని విషయాలను బయటకు తీసుకొచ్చి ప్రజలనుఎలా దారిమళ్లిస్తున్నారో తెలియదా? ఎవరికి తెలియదు మీ చీప్ ట్రిక్స్. ఎతసేపూ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటిఉందా? ఏం అర్హతఉందండీ మీకు.. నోటికొచ్చినట్టు మాట్లాడటానికి. ప్రజలుపన్నురూపేణాకట్టిన సొమ్ములో నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుంటున్న మీరు చెప్పుకోవడానికి ఏ ఒక్క మంచి పని చేశారా మీరు?
వసతి దీవెన, అమ్మఒడి, సున్నావడ్డీ రుణాలు ఎంతిచ్చారో..ఎంతమందికి ఎలాఇచ్చారో అందరికీ తెలుసు. అమ్మఒడి, రైతుభరోసాలు ఎలాఎగ్గొట్టారో తెలుసు. చివరకు మీరు ఏస్థా యికి దిగజారారంటే చిన్నపిల్లలు తినేచిక్కీలు వారిచేతికి అంటుకోకూడదని వాటికి కవర్లు వేశారంటా! ఆ కవర్ ఇచ్చి ఉద్ధరించాడంటా.. అదీ మీనాయకుడి పనితీరు. ఏంచేసింది చెప్పు కోవడానికి లేక చివరకు మీ ముఖ్యమంత్రి చెబుతున్న మాటలుఅలాఉన్నాయి.
అయ్యా సజ్జలరామకృష్ణారెడ్డి.. చిక్కీ అంటేనే అదికవర్ తో ఉంటుంది. కవర్ తీసేసే ఎవరైనా తింటారు. కవర్ తీయకుండా ఎవరూ తిననుకూడా తినరు. ఏంచేశామనిచెప్పుకుంటారు… ఏముందని చెప్పుకుంటారు. అందుకే ఇలాకవర్ కథలుచెబుతున్నారు.
చంద్రబాబునాయుడి హయాంలో కూడా చిక్కీ (పప్పుచెక్క) కి కవర్ ఉంది.. ఖర్మ అదికూడా చెప్పుకుంటు న్నారు మీరు. ఎవరికి మతిభ్రమించిందో మీరుచెబుతున్న మాటలేచెబుతున్నాయి. ఇంకోసారి చంద్రబాబుగురించి మాట్లాడితే ఊరుకునేదిలేదు. అలానే అమ్మవారి గురించి కూడా. గతంలోకూడా అమరావతిమహిళలు అమ్మవారి వద్ద పొంగళ్లుపెట్టుకోవడానికి వెళితే అప్పుడుకూడా ఇలానే హేళనగా మాట్లాడారు. మాట్లాడితే వెన్నుపోటుదారులని…. అదని ఇదని అంటూంటారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగారు చని పోయినప్పుడు ఎర్రకాలువ దగ్గరికి నువ్వువెళ్లావా సజ్జల రామకృష్ణారెడ్డీ.? మీ నాయకుడు వెళ్లాడా? వెళ్లలేదు. అక్కడినుంచి రాజశేఖర్ రెడ్డి మృతదేహంకర్నూలు ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టమ్ కోసం తరలిస్తే మీరువెళ్లారా? వెళ్లలేదు. అక్కడినుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కి శవంవస్తే, దాన్ని తీసుకురావడానికైనా వెళ్లారా….వెళ్లలేదు. ఆ సమయంలో మీరు, మీ నాయకుడు ఏంచేశారు సజ్జలా? ఇంట్లోకూర్చొని సంతకాలసేకరిస్తూ లాబీయింగ్ లు నడిపారు. ఏం కమిట్ మెంట్ ఉంది మీకు?
ఇవన్నీకాదు, రెండ్రోజులక్రితం విజయమ్మ గారి పుట్టినరోజు వచ్చింది. ఇంట్లోమనిషేకదా.. కనీసం ఆమెకు ఫోన్ చేసైనా శుభాకాంక్షలు చెప్పారా? వైసీపీలో ఎవరైనా ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు? తల్లిని,చెల్లిని వాడుకొని, వారిని ఆంధ్రరాష్ట్రం నుంచి గెంటేశారు. ఒకచెల్లేమోఢిల్లీ వీధుల్లో తిరుగుతుంటే వాటికి సమాధానంచెప్పే పరిస్థితి మీకులేదు. అలాంటి మీరు చంద్రబాబుగురించి ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాను సజ్జలగారు?
ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నా రా? నేరుగా అసలు మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడలేరా? దేవుడిదర్శనానికి వెళ్లొచ్చినా ఎందుకు పెడార్థాలు తీస్తున్నారు? అంటేకాలం కలిసివచ్చే రోజులు మీకు పోయాయని అర్థమైందన్నమాట. సజ్జల రామకృష్ణారెడ్డి నీకు ఇదేఆఖరిసారిచెప్పడం.. ఇంకోసారి ఇలా మాట్లాడితే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాను. వయసుకు తగినట్టుగా మాట్లాడితే మంచిది. ఏదేదో మాట్లాడటంకాదు సజ్జలా… ఎడిటర్ గా వెలగబెట్టావు.. ఆరునెలలకోసారి ముఖ్యమంత్రిని బయటకుతీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించలేవు. చంద్రబాబుగారి గురించి మాట్లాడే అర్హతమీకు లేదని గుర్తించి, ఇప్పటికైనా మూటాముల్లే సర్దుకొని పక్కకు పోవడానికి సిద్ధపడండని అనురాధ మండిపడ్డారు.