ఆర్ఐపై మట్టి మాఫియా హత్యాయత్నం

Spread the love

– కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ పై హత్యాయత్నానికి పాల్పడ్డ మట్టి మాఫియా
– నిందుతులు మాజీ కొడాలి నాని అనుచరులే
-గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐపై హత్యాయత్నం
-మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐపై జేసీబీతో దాడి
– ఆర్ఐ అరవింద్ పై దాడి
-అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
– కొన్ని రోజులుగా రాత్రి వేళ మట్టి తవ్వకాలు చేస్తున్న వైనం
– అడ్డుకుంటున్న అధికారులపై బెదిరింపులకు దిగుతున్న మట్టి మాఫియా
– గుడివాడ లో ఆర్ఐ అరవింద్‌ పై దాడి చేసిన నిందితులు గుర్తింపు
– మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు గంట సురేష్ తమ్ముడు గంట కళ్యాణ్‌ గా గుర్తింపు
– రెవెన్యూ అధికారులపై దాడి విషయం తెలిసినా పట్టనట్లు వ్యవహరించిన పోలీసులు
– ఘటనాస్థలికి కేవలం కానిస్టేబుల్ ను మాత్రమే పంపిన పోలీసులు
– వైసీపీ నేతల ఒత్తిడితో ఘటనను నీరుగార్చే ప్రయత్నం
– ఆర్ ఐపై దాడి చేసిన వారి అరెస్టుకు రెవెన్యూ సంఘాల డిమాండ్

దాడికి గురై తప్పించుకున్న ఆర్ఐ ఆనంద్ మాటల్లో.. నాకు గుడివాడ తహశీల్దార్ నుంచి ఫోన్ వచ్చింది. మోటూరులో అక్రమ మట్టి తప్వకాలు జరుగుతున్నాయని ఫోన్ వచ్చింది. వీఆర్ఏ, వీఆర్వోలను వెంటబెట్టుకుని మోటూరుకు వెళ్లా. జేసీబీ, మూడు ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మట్టి

తవ్వకాలను అపాలని హెచ్చరించా. మట్టి తవ్వకాలు ఆపకుండా నాతో వాగ్వాదం చేశారు. జేసీబీతో నాపై దాడి చేశారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా..పోలీసులు వచ్చి 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేశారు.

Leave a Reply