-వైసీపీ నేతలు డెకాయిట్లను మించి అక్రమ మైనింగ్ తో కోట్లాది రూపాయిలు దోచుకుంటున్నారు
– అక్రమ మైనింగ్ లో సజ్జల నుంచి వైవీ సుబ్బారెడ్డి , పెద్దిరెడ్డి వరకు ఎవరికి వాటాలు లేవో చెప్పాలి ?
– అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 62 మంది ప్రాణాలు పోవటానికి కారణం ఎవరు?
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు డెకాయిట్లను మించి అక్రమ మైనింగ్ తో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….
వైసీపీ నేతల అక్రమ మైనింగ్ ని సాక్ష్యాలతో సహా మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరూపించారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేయకపోతే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? ఈ మూడేళ్లలో జరిగిన అక్రమ మైనింగ్ పై అఖిలపక్ష సమావేశం దైర్యం వైసీపీ ప్రభుత్వానికి ఉందా? రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకి 75 నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్, ఇసుక దోపిడి జరుగుతోంది. టీడీపీ హయాంలో కృష్ణా నది వెనుక వైపు ఇసుక దోపిడి జరిగిందని వైసీపీ నేతలు ప్రచారంచేశారు.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాకా గతంలో అక్రమంగా ఇసుక దోపిడి జరగలేదని ఎన్జీటీకి అఫడవిట్ ఇచ్చి మరీ మళ్లీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు, అనుమతులు తీసుకోవటం వాస్తవం కాదా? మైనింగ్ కి లీజులకు చంద్రబాబు అనుమతులిచ్చారని వైసీపీ నేతలంటున్నారు. కానీ అనుమతులు ఎవరు ఇచ్చారన్నది ముఖ్యం కాదు. ఎవరు దారుణంగా దోచుకుంటున్నారన్నదే ముఖ్యం.
అక్రమ మైనింగ్ లో సజ్జల రామకృష్ణా రెడ్డి నుంచి వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు ఎవరి వాటాలు లేవో చెప్పాలి? పిల్లి సుభాష్ చంద్రబోష్ నుంచి తోట త్రిమూర్తులు, నందిగం సురేష్, మేడా మల్లిఖార్జునరెడ్డి వరకు అందరీ అక్రమ మైనింగ్ కు మా వద్ద సాక్ష్యాలున్నాయి. త్వరలో అందరి జాతకాలు బయటపెడతాం. మేడా మల్లిఖార్జునరెడ్డి ఇసుక దందాకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 62 మంది ప్రాణాలు కోల్పోవటం వాస్తవం కాదా? దీనికి సజ్జల సమాధానం చెప్పగలరా? వైసీపీ హయాంలో మైనింగ్ విపరీతమైన ప్రగతి సాధించామని సజ్జల చెప్పటం సిగ్గుచేటు.
మైనింగ్ లో ప్రగతి గతంలోకంటే – 15.89 దిగజారిపోయిందని సోషియో ఎకనామిక్ సర్వే చెప్తోంది. ఇది సజ్జల కళ్లకు కనిపించటం లేదా? వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ లో దోపిడి చేసిన మాట వాస్తవం. ఈ విషయం ప్రజలకు తెలుసు. కానీ వైసీపీ నేతలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి అబద్దాలు చెప్పినంత మాత్రాన అవి వాస్తవాలు కావన్నది సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు గ్రహించాలని పంచుమర్తి అనురాధ అన్నారు.