– తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందనలు
అమరావతి:- ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలో టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ ఘనవిజయం ప్రజావిజయం. ఆమె గెలుపు అన్నివర్గాల ప్రజల గెలుపు, ఇదొక ప్రజావిజయం..ఇంత క్లిష్ట ఎన్నికలో అనురాధ సునాయాస గెలుపు స్ఫూర్తిదాయకం. మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో మొత్తం 3స్థానాల్లో విజయం, ఇప్పుడు పోటీచేసిన ఒకేఒక స్థానంలోనూ టిడిపి ఘనవిజయం అద్భుతం. చంద్రబాబు పోరాట స్ఫూర్తికి, లోకేశ్ యువగళోత్సాహానికి, టిడిపి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి ఈ వరుస విజయాలే నిదర్శనం. ఇదే స్ఫూర్తితో పనిచేసి రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని విజయపథంలో నిలబెట్టడమే మనందరి కర్తవ్యం, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష.