-అనురాగ్ సింగ్ ఠాగూర్
విజయవాడలో జరిగిన యువమోర్చా “యువ సంఘర్షణ యాత్ర” ముగింపు సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన కేంద్ర సమాచార , ప్రసార శాఖ మరియు యువజన విభాగం మరియు క్రీడలు శాఖా మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో రమేష్ నాయుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా వున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై , బాబు-ఏది మా జాబు అని, పోరాటం చేసారని ప్రస్తుతం ముఖ్యమంత్రులు మారినా తీరు మారలేదని ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా రమేష్ నాయుడుతో ఉన్న సాహిత్యాన్ని గుర్తు చేశారు.