-రాజధాని అమరావతిని మార్చడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంవల్లేకాదు..ఏ ప్రభుత్వం వల్లా కాదు
-16నెలలు జైల్లో ఉండొచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని జైలులా, ప్రజలను ఖైదీల్లా మార్చాలని చూస్తున్నాడు
• పార్లమెంట్ లో జరిగినచర్చలకు భిన్నంగా, రాజ్యాంగంలోని నిర్ణయాలకు విరుద్ధంగా, ఆర్గనైజేషన్ యాక్ట్ కు భిన్నంగా వ్యవహరించడం ఎవరివల్లా కాదు
• రాష్ట్రరాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ఇప్పటికైనా చెప్పి, తప్పు ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని మన్నిస్తారు.
• తప్పు గ్రహించకుండా కోర్టుల్ని, ప్రజలను మోసగించాలని చూడకండి
• పగబట్టిన విషసర్పంలాంటి జగన్మోహన్ రెడ్డి వైఖరే రాష్ట్రవిధ్వంసానికి కారణం
• చంద్రబాబునాయుడిగారిని, ఆయన కుటుంబాన్ని దూషించిన అసెంబ్లీ చంద్రబాబు కట్టించిందే
• గతంలో మీరు తీసుకొచ్చిన బిల్లులకు ఇప్పుడు ఏగతి అయితే పట్టిందో, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే బిల్లులకు భవిష్యత్ లో అదే గతి పడుతుంది
-టీడీపీ రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్
అసెంబ్లీ సాక్షిగా గౌరవముఖ్యమంత్రి, ఆర్థికమంత్రిగారు అవాస్తవాలుచెప్పి సభను పక్కదారి పట్టించడమేగాక, ప్రజలను మోసగించడానికి సిద్ధమయ్యారని, గతంలో కోర్టులను కూడా తప్పదారిపట్టించి, వాటి ప్రొసీడింగ్స్ ని అడ్డుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అనేక ప్రయత్నాలుచేసిందని, ఆ ప్రయత్నాలవైఫల్యమే నేడు ప్రభుత్వం బిల్లులు వెనక్కు తీసుకోవడమని టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టంచేశారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు …!
ప్రజలను మోసగించడంలో దిట్టఅయిన జగన్మోహన్ రెడ్డి, ఆయననప్రభుత్వంలోని వారు ఇప్పటికే లెజిస్లేచర్ ను పక్కదారి పట్టించారు..ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లు కి గతంలో బిల్లుకి ఏగతి అయితే పట్టిందో అదేగతి పడుతుంది. కేంద్రప్రభుత్వం తెచ్చిన చట్టానికి భిన్నంగా ప్రజలకు అవకాశమివ్వకుండా, ఆదుర్తాతో మూడురాజధానుల బిల్లుని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది.మూడురోజులు అంటూ ఒక్కరోజుకే రైతుల అభిప్రాయాలను తీసుకోవడానికి సమయాన్ని పరిమితంచేశారు. దానిపై రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. రైతుల వాదనలు, ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టంపై కోర్టు ఉత్తర్వులిచ్చినా వాటిని పరిగిణనలోకి తీసుకోలేదు. కోర్టుల్లో కేసులు వేసిన రైతులను బెదిరించారు.
వాదనలు వింటున్న న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించారు. న్యాయమూర్తులను దూషించినవారికి అండగాఉండి, వారిని మరింత ప్రోత్సహించారు. న్యాయమూర్తులను దూషించినవారిని పట్టుకోవడంలో మీరువిఫలమైతే, న్యాయస్థానమే సదరు అంశాన్ని సీబీఐకి అప్పగించి వారిపై చర్యలు తీసుకోవడం ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? మీకు సిగ్గుగా లేదా? రాష్ట్రప్రభుత్వానికి తలవంపుకాదా? వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులను రోడ్లపాలు చేశారు. న్యాయస్థానాల్లో పడబోయే మొట్టికాయలకు దిక్కుతోచక, చివరకు బిల్లులను ఉపసంహరించుకున్నారు. న్యాయమూర్తులు ఏకేసులు విచారించాలో కూడా మీరే నిర్ణయించాలని చూశారు. మీకుతెలుసు మీరుచేసిన తప్పలేమిటో. శాసనమండలిని గౌరవించకుండా దాన్ని రద్దు చేయమన్నారు. కోర్టులను తప్పుదారి పట్టించాలన్న రాష్ట్రప్రభుత్వవైఫల్యఫలితమే, నేడు బిల్లులు వెనక్కు తీసుకోవడం. న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుందన్నభయంతోనే ఇప్పుడు మూడురాజధానుల బిల్లు ఉంపసంహరణ. ప్రభుత్వం తీసుకున్న దాదాపు 180కు పైగా నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. బిల్లులు విత్ డ్రా చేయడాన్నిస్వాగతిస్తున్నాం..కానీ ఆ నిర్ణయం వెనకున్న మీ దుర్భుద్ధిని ఖండిస్తున్నాం.
ఇప్ప్పుడు మీరుతీసుకొచ్చే బిల్లులకుకూడా గతంలో తీసుకొచ్చినవాటికి పట్టిన గతే పడుతుంది.
లెజిస్లేచర్ ను పక్కదారి పట్టించి, ప్రజలను మోసంచేయడమేగాక న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తున్నారు. గతంలో ప్రాంతాలమధ్యవిద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టంలేక అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నామన్నారు. ఆ ప్రకటనపై ఇప్పటి ప్రభుత్వం ఎందుకు వెనక్కుతగ్గిందో చెప్పాలి. ఇప్పుడు బిల్లులు ఉపసంహరించుకోవడం వెనుక పాలకులు రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. మీ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన అమరావతి రైతులకు తలొగ్గి మూడురాజధానుల బిల్లు ఉపసంహరణకు పూనుకున్నారు. బిల్లు ఉపసంహరణ వెనుక పెద్దరాజకీయకుట్ర ఉంది. 20-01-2020న ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో డీసెంట్రలైజేషన్ యాక్ట్, సీఆర్డీఏ రిపీల్ బిల్ తీసుకొచ్చారు. ఆయాక్ట్ లో మొదటిది శ్రీకృష్ణ కమిటీని ఉల్లంఘించి, దానిపై ఎక్స్ పర్ట్ కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ వేశారని చెప్పారు.
ముఖ్యమంత్రి చెప్పిందే ఆయాకమిటీలు నివేదికలరూపంలో ప్రభుత్వం ముందుఉంచాయి. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్తబిల్లుల్లోకూడా పాలకులు అదేపంథాను అనుసరించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కాదుకదా..ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి ప్రభుత్వం వచ్చినా రాజధాని మార్చలేదు. మొదట్నుంచీ అదేచెబుతున్నాం. పార్లమెంట్ లోజరిగినచర్చలకు భిన్నంగా, రాజ్యాంగంలోని నిర్ణయాలకు విరుద్ధంగా, ఆర్గనైజేషన్ యాక్ట్ కు భిన్నంగా వ్యవహరించడం ఎవరివల్లా కాదు. రాష్ట్రరాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ఇప్పటికైనా చెప్పి, తప్పు ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని మన్నిస్తారు. తప్పు గ్రహించి సరిదిద్దుకోకుండా కోర్టులను, ప్రజలను మోసగించాలని చూడకండి. ఈ ప్రభుత్వం చేసిన తప్పులకు ఇంకో ముఖ్యమంత్రి అయితే ఎన్నోసార్లు రాజీనామా చేసేవాడు. కానీ వీరికి ఎలాంటి నైతికవిలువలు లేవు కాబట్టి, అలాచేయరు. పగబట్టిన విషసర్పంలాంటి జగన్మోహన్ రెడ్డి వైఖరే రాష్ట్రవిధ్వంసానికి కారణం.
రూ.40వేలకోట్ల అభివృద్ధి పనులు జరిగిన ప్రాంతాన్ని శ్మశానంగా మార్చింది మీరు కాదా? అభివృద్ధి చెందుతున్న జీవకళ గలప్రాంతాన్ని నిర్జీవంగా మార్చారు. ఆఖరికి మీ మంత్రులతో శ్మశానమని, ఎడారని మాటలనిపించారు. చేయాల్సిందంతా చేసి, రాజధానిలో ఏమీ లేదంటున్నారు.చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబాన్ని దూషించిన అసెంబ్లీ చంద్రబాబు కట్టించిందే. సచివాలయం, హైకోర్ట్ సహా విజయవాడ, గుంటూరులోని పరిపాలనాభవనాలు కట్టించింది టీడీపీప్రభుత్వమే. 16నెలలు జైల్లోఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని జైలులా మార్చి, ప్రజలను ఖైదీల్లా ఉంచాలని చూస్తున్నాడు. అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే న్యాయపరమైన ప్రక్రియ ఆరంభించామని, రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని చెప్పారు.
చివరకు విధిలేక న్యాయవిచారణ ప్రక్రియ అడ్డుకోవడానికే బిల్లుని వెనక్కు తీసుకున్నారు. ఏ శాసనమండలిని అయితే రద్దుచేయమన్నారో, అదే మండలికి సభ్యులను నామినేట్ చేస్తూ మీ దుందుడుకు వైఖరిని బయటపెట్టుకున్నారు. గతంలో మీరు తీసుకొచ్చిన బిల్లులకు ఇప్పుడు ఏగతి అయితే పట్టిందో, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే బిల్లులకు భవిష్యత్ లో అదే గతి పడుతుంది. రాజధానిలేని అథోగతికిరాష్ట్రాన్నిచేర్చారు. అదే గందరగోళాన్ని మరోరెండున్నరేళ్లు కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రజలే మీకు 151 సీట్లు ఇచ్చారు. మరి అదేప్రజలను ఎందుకు మోసగిస్తూ, అనిశ్చితిలోకి ఎందుకు నెడు తున్నారు? ముఖ్యమంత్రి గారు, రాజేంద్రనాథ్ రెడ్డిగారి స్టేట్ మెంట్స్ లో ప్రజాభిప్రాయం అన్నారు. ఇదివరకు వేసిన కమిటీల మాదిరే భవిష్యత్ లోనూ ప్రభుత్వం ప్రజాభిప్రాయం తీసుకుంటుందా?