Suryaa.co.in

Political News

ఎనీటైం మునుగోడు..!

మునుగోడు ముగిసింది..
మనగోడు మిగిలింది..
అక్కడ ఎన్నికలు
వచ్చినప్పుడే పంచుడు..
ఇక్కడ రోజూ
పంచుడు..దంచుడే..!

వచ్చే ఎన్నికల కోసం
మొన్న ఎన్నికలు ముగిసినప్పటి నుంచి
మొదలైన పంపిణీ..
ప్రతి రోజూ పడుతుంది బోణీ
అదేగా మన బాణీ..!

కారు అయిదు..
కమలం నాలుగు..
ఆ రెంటికే వీచింది గాలి..
ఇక్కడ సదా ఫ్యాను ‘సుడి’గాలి..
పంపిణీలతో గేలి..
అదో రకం కేళి..
ఆడించే కథాకళి..
పథకాలతో వ్యాహ్యాళి..!

జీతమిచ్చినా లేకున్నా
ఆగేది లేదు పంపిణీ..
పుడితే అప్పు..
పుట్టకపోతే తాకట్టు..
నిధుల మళ్లింపు కనికట్టు..
కొత్తపేర్లతో పథకాల పడికట్టు!

పథకాలు ముట్టినోడు మనోడు..
స్టేట్ మొత్తం మునుగోడు..
పథకాలే రక్ష..
పంచుడే అభివృద్ధి..
రాష్ట్రమంతా ‘శుద్ధి’..
బటనే మంత్రదండం..
ఓటరూ..నీకో దండం!

– ఈ ఎస్కే..

LEAVE A RESPONSE