Suryaa.co.in

Andhra Pradesh

ఏపీని జగన్ హత్యలప్రదేశ్ గా మార్చేశారు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఏపీని హత్యల ప్రదేశ్‍గా జగన్ మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ నేత కోళ్ల అప్పలనాయుడు కుమార్తె వివాహానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీమంత్రి కిమిడి కళా వెంకటరావు ఇంటి వద్ద ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి 18 మంది టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జులతో మాట్లాడారు. బాదుడే బాదుడు కార్యక్రమం కోసం వెళుతుంటే సర్కారుపై జనాగ్రహం వెల్లువెత్తుతోందని ఇన్ ఛార్జ్ లు వివరించారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళుతున్నానని, తెలుగుదేశంపై ప్రజాదరణ రెండింతలు అయ్యిందన్నారు.

అప్సర థియేటర్ సెంటర్లో మాజీమంత్రి కోండ్రు మురళీ మోహన్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో రాజాం పరిధి ఐదు పంచాయతీల నుంచి టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపైనా వైసీపీ నాయకులు దాడులకి దిగుతున్నారని, వైసీపీ ఎమ్మెల్సీ ఆయన కారు డ్రైవర్ ని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని ఆరోపించారు. జగన్ రెడ్డి ఆయుధం కోడికత్తి అయితే తెలుగుదేశం ఆయుధం పోరాడే పిడికిలి అని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ జగన్ బాదుడే బాదుడు పై యుద్ధం మొదలైందన్నారు. పెంచుకుంటూ పోతానని ధరలన్నీ పెంచేసిన జగన్ రెడ్డిని గద్దె దింపడమే టిడిపి ధ్యేయమన్నారు.

జై లోకేష్… జై…జై లోకేష్
విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి ఆరంభమైన జై లోకేష్… జై…జై లోకేష్ నినాదాలు జాతీయ రహదారి మీదుగా ఆగిన ప్రతీ జంక్షన్లో మారు మోగాయి. రాజాంలో లోకేష్ వెళుతుండగా భోగాపురం, చిలకపాలెం, పొందూరులలో తెలుగు దేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం జెండాలతో అధికసంఖ్యలో హాజరైన పసుపు సైనికులు దారిపొడవునా లోకేష్ ని ఆత్మీయంగా పలకరించారు.

LEAVE A RESPONSE