Suryaa.co.in

Andhra Pradesh

గవర్నర్ దంపతులను పరామర్శించిన సిఎం

రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసారు. సాయంత్రం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. ఇటీవల కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య స్ధితి గతులను వాకబు చేసారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని గవర్నర్ కు ముఖ్యమంత్రి విన్నవించారు. గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యం, రాజ్ భవన్ ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE