అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారని, మధ్యలో మూడు పెద్ద ఖాళీలు వదిలి పెట్టారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్ప కాలిక చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టంతో పాటు నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగిందని తెలిపారు.
దిగువ కాపర్‌డ్యామ్‌కు కూడా భారీ నష్టం వాటిల్లిందని, పునాదిపైన, లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంట ఏర్పడిందని తెలిపారు. చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చిందని సీఎం జగన్ అన్నారు. వక్రీకరణ, అబద్దాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తాను విజనరి అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని తెలిపారు.
కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013-2014 అంచనాల ప్రకారమే ప్రాజెక్టు కడతామని చెప్పారని అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే అప్పట్లో అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని అన్నారు.